బిజినెస్

బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, అక్టోబర్ 2: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడింది. 89 శాతం ఉత్పదక రేటును మాత్రమే సాధించింది. సెప్టెంబర్ మాసం ముగిసేనాటికి గడచిన ఆరు మాసాలలో 2 కోట్ల 93 లక్షల 76 వేల 500 టన్నుల బొగ్గును సాధించాల్సి ఉండగా, 2 కోట్ల 61 లక్షల 82 వేల 302 టన్నులు మాత్రమే సాధించి 89 శాతం ఉత్పాదక రేటు నమోదు చేసుకుంది.
సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా, కేవలం కొత్తగూడెం ఏరియా మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను అధిగమించింది. 37 లక్షల 41 వేల టన్నుల లక్ష్యానికి 38 లక్షల 59 వేల 736 టన్నులు సాధించి 103 శాతం ఉత్పాదకరేటుతో మెరుగైన ఫలితాలు అందుకుంది. మిగిలిన ఏరియాల ఉత్పత్తి వివరాలిలా ఉన్నాయి. రామగుండం-3 ఏరియా 98 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 95 శాతం, బెల్లంపల్లి ఏరియా 93 శాతం, భూపాలపల్లి ఏరియా 91 శాతం, రామగుండం-1 ఏరియా 90 శాతం, మణుగూరు ఏరియా 88 శాతం, రామగుండం-2 ఏరియా 88 శాతం, ఇల్లందు ఏరియా 79 శాతం, ఆడ్రియాల ప్రాజెక్ట్ 70 శాతం, మందమర్రి ఏరియా 62 శాతం ఉత్పాదక రేట్లను నమోదు చేసుకున్నాయి.
కాగా, ఈ ఆర్థిక సంవత్సరం లో బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు సెప్టెంబర్ చివరి వారంలో మల్టీ డిపార్టుమెంటల్ కమిటీల ద్వారా సింగరేణి వ్యాప్తంగా యాజమాన్యం ప్రతి గని, డిపార్టుమెంట్ వద్ద సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాలలో సంస్థ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను అధిగమించాలంటే చేపట్టాల్సిన కర్తవ్యాలపై వివరిస్తూ కార్మిక వర్గాన్ని చైతన్యపరిచింది. తాజా ఫలితాల నేపథ్యంలో దీని ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాలి.