బిజినెస్

ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపై ఆధారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మంగళవారం జరిగే ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలతోపాటు భారత్-పాక్ యుద్ధ వాతావరణం మదుపరులపై ప్రభావం చూపవచ్చని విశే్లషిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ వారం ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షపైనే మదుపరుల పెట్టుబడులు ఆధారపడి ఉన్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా అన్నారు. అలాగే సెప్టెంబర్‌లో ఆటో రంగ సంస్థల అమ్మకాలు కూడా మార్కెట్ తీరుతెన్నులను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఆర్‌బిఐ కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో నూతనంగా ఏర్పాటైన ద్రవ్య విధాన కమిటీ మంగళవారం ద్రవ్య సమీక్షను నిర్వహించనుంది. కాగా, గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 802.26 పాయింట్లు క్షీణిస్తే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 220.40 పాయింట్లు పడిపోయింది. గురువారం ఒక్కరోజే సెనె్సక్స్ 465, నిఫ్టీ 154 పాయింట్లు పతనమైనది తెలిసిందే.