బిజినెస్

ఆకర్షణీయంగా భారతీయ విపణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: విదేశీ మదుపరులు గత నెలలో దేశీయ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు. గడచిన 11 నెలల్లో ఈ స్థాయలో పెట్టుబడులు రావడం ఇదే ప్రథమం. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఏకగ్రీవంగా ఆమోదం పొందడం , ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను వివిధ సంస్థలు ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు బాగుండటం వంటివి అటు స్టాక్ ఇటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులను అమితంగా రప్పించాయ. సెప్టెంబర్‌లో స్టాక్ మార్కెట్లలోకి 10,443 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చిన విదేశీ మదుపరులు.. రుణ మార్కెట్‌లోకి 9,789 కోట్ల రూపాయల పెట్టుబడులను పట్టుకొచ్చారు. దీంతో మొత్తంగా గత నెల స్టాక్, రుణ మార్కెట్లలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల విలువ 20,232 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు అక్టోబర్‌లో 22,350 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, మళ్లీ ఆ తర్వాత ఈ సెప్టెంబర్‌లోనే ఆ స్థాయలో పెట్టుబడులు వచ్చాయ. అంతకుముందు రెండు నెలల్లోనూ విదేశీ పెట్టుబడులు భారతీయ మార్కెట్లలోకి భారీగానే వచ్చాయ. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 0.1 శాతానికి తగ్గడం, వాహన అమ్మకాలు కూడా ఆశాజనకంగా నమోదు కావడం వంటివి కలిసొచ్చాయ. అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తమ వడ్డీరేట్లను పెంచకుండా ఉండటం కూడా లాభించింది. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. అంతకు ముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. కాగా, ఈ ఏడాది జనవరి-జూన్‌లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసు కున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా (జనవరి-సెప్టెంబర్) స్టాక్ మార్కెట్లలోకి 51,293 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అలాగే రుణ మార్కెట్లలోకి 2,441 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 53,734 కోట్ల రూపాయలుగా నమోదైంది.