బిజినెస్

కెసిఆర్‌ను కలిసిన జర్మన్ రాయబారి మార్టిన్ నే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: జర్మనీ కానె్సల్ హైదరాబాద్ విభాగానికి గౌరవ కానె్సల్‌గా నాస్కాం మాజీ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. జర్మన్ దేశ రాయబారి మార్టిన్ నే, ఆయన సతీమణి గాబ్రి ల్ నీ, ఐటి దిగ్గజం బివిఆర్ మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా బివిఆర్ మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న నూతన ఐటి విధానం, పారిశ్రామిక విధానం గురించి జర్మనీ అంబాసిడర్‌కు వివరించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రగతి, ఐటి విధానాలు, పారిశ్రామిక విధానాలపై పుస్తకాన్ని జర్మన్ అంబాసిడర్‌కు అందచేశారు. తమ రాష్ట్రంలో దేశంలోనే అత్యున్నతమైన ఏకగవాక్ష విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో జర్మన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా తమ దేశంలో ప్రచారం చేస్తామని అంబాసిడర్ మార్టిన్ నే తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కెటి రామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌తో మార్టిన్ నే