బిజినెస్

తెలంగాణ ఉక్కు పరిశ్రమకు ‘విద్యుత్’ సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 4: తెలంగాణలో స్టీల్ పరిశ్రమ విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక సంక్షోభంలో పడింది. రెండేళ్ల క్రితం వరకు విద్యుత్ కొరతతో సతమతమైన ఉక్కు పరిశ్రమకు ఈ రోజు సరిపడా విద్యుత్ సరఫరా అవుతోంది. అయతే 2009-10లో ఒక యూనిట్ విద్యుత్ ధర రూ. 3.15 పైసలు ఉంటే, నేడు రూ. 7 కావడంతో ఉత్పత్తి వ్యయం పెరిగింది. దీంతో పరిశ్రమను ఆదుకునేందుకు వెంటనే విద్యుత్‌ను సబ్సిడీ ధరలపై సరఫరా చేయాలని అఖిల భారత ఫర్నేసస్ అసోసియేషన్ చైర్మన్ సురేష్ కుమార్ సింఘాల్ డిమాండ్ చేశారు. తమిళనాడు, చత్తీస్‌గడ్, కర్నాటక, మహారాష్టల్రో స్టీల్ ఉత్పత్తుల పరిశ్రమకు యూనిట్‌ను రూ. 3.50 పైసలకే సరఫరా చేస్తున్నారు. విద్యుత్ శాఖ ఆ రాష్ట్రాల్లో స్టీల్ పరిశ్రమకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు. కాగా, ఉక్కు పరిశ్రమల్లో ఉత్పత్తి వ్యయం లో 40 శాతం విద్యుత్‌కే ఖర్చవుతోందన్నారు. ప్రస్తుతం విద్యుత్ భారం మోయలేక 30 పరిశ్రమలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిల్లో దాదాపు 20 వేల మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నారు. మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉక్కు ఉత్పత్తుల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. విభజన కంటే ముందు విద్యు త్ కొరత ఉన్నా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మాత్రం కోతలు లేకుండా విద్యుత్ నిరాటంకంగా సరఫరా అవుతోంది. కాని చార్జీల భారమే ఈ పరిశ్రమకు శాపంగా మారిందని మెదక్ జిల్లా జిన్నారంకు చెందిన పరిశ్రమ వర్గాలు అన్నాయి. ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా విధించే అవకాశం ఉందని తెలియడంతో ఈ పరిశ్రమ కుదేలవుతోంది. రాష్ట్రంలో ఈ పరిశ్రమ చిన్న, మధ్యతరహా పరిశ్రమల కేటగిరీలోకి వస్తుంది. త్వరలో పరిశ్రమల శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రిని కలిసి ఉక్కు ఉత్పత్తుల పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కోరనున్నట్లు ఫర్నేసస్ అసోసియేషన్ తెలిపింది.