బిజినెస్

హ్యుందాయ్ ఇయాన్ కార్ల రీకాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: హ్యుందాయ్ మోటార్ ఇండియా 7,657 ఇయాన్ కార్లను రీకాల్ చేసింది. క్లచ్, బ్యాటరీ కేబుల్స్‌కు సంబంధించిన సమస్యలను సరిచేయడానికే ఈ రీకాల్ అని సదరు సంస్థ స్పష్టం చేసింది. కాగా, 2015 జనవరిలో తయారైన ఇయాన్ మోడల్స్‌లోనే ఈ సమస్యలు తలెత్తాయి. ఈ సమస్య కలిగిన కార్లను సమీప హ్యుందాయ్ డీలర్ల వద్దకు తీసుకెళ్తే ఉచితంగా సమస్యను పరిష్కరిస్తారని ఓ ప్రకటనలో మంగళవారం హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలియజేసింది. కాగా, 2014లోనూ హ్యుందాయ్ 2,437 శాంటా ఫే కార్లను రీకాల్ చేసినది తెలిసిందే.