బిజినెస్

పాలసీ మారినా.. కానరాని ప్రగతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 5: ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. డిజిటలైజేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. మరోపక్క ఈ-ఫైలింగ్‌ను ముమ్మరంగా చేపట్టింది. ప్రతి శాఖలోనూ ఐటిని ప్రవేశపెట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో ఐటి రంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనుకుంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో హైటెక్ సిటీని నిర్మించారు. అది దేశంలోనే ఇప్పుడు మూడో స్థానంలో నిలిచింది. అయితే, విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఐటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతగా ఫలితాలను ఇవ్వడం లేదు. దీనివలన ఐటి ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. ఐటి పరిశ్రమాభివృద్ధికి ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. కానీ అది పెద్దగా ఉపయోగపడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర విభజన తరువాత విశాఖను ఐటి హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రుషికొండలో హిల్-1,2,3లను ఐటి కంపెనీల ఏర్పాటుకు కేటాయించింది. సుమారు ఆరు, ఏడు సంవత్సరాల కిందటే ఇక్కడ కంపెనీలు ఏర్పాటయ్యాయి. కానీ, ఇప్పటికీ అరకొర వౌలిక సదుపాయాలతో కంపెనీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోయింది.
ఐటి గత విధానంలో పవర్‌కు 25 శాతం, ఇంటర్‌నెట్‌కు 25 శాతం సబ్సిడీ ఇచ్చేది. అలాగే రెంట్ సబ్సిడీ కూడా ఉండేది. ఇది కాకుండా ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకుని, ఏడాదిపాటు కొనసాగిస్తే 15,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసేది. ఇప్పుడు ఈ సబ్సిడీలన్నింటినీ తొలగించింది. సొంతంగా కార్యాలయాన్ని నిర్మించుకున్న సంస్థకు ఉద్యోగికి లక్ష రూపాయలు, అద్దెకు తీసుకుని కంపెనీని ఏర్పాటు చేస్తే 50 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లించేలా పాలసీని రూపొందించింది. అయతే కొత్త కంపెనీలకు ఈ విధానం ఉపయోగపడటం లేదని చెబుతున్నారు.
మెరుగైన గుజరాత్ పాలసీ
ఇదిలా ఉండగా గుజరాత్‌లో ఐటి పాలసీ.. కంపెనీలను ప్రోత్సహించే విధంగా ఉందని ఐటి యజమానులు అభిప్రాయపడుతున్నారు. గుజరాత్‌లో ఐటి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను ప్రభుత్వమే చెల్లిస్తోంది. కంపెనీని విస్తరించే యాజమాన్యాలకు విస్తరణ ఖర్చులో 50 శాతాన్ని, ఐదు కోట్ల రూపాయలకు మించకుండా భరిస్తుంది. దీనివలన గుజరాత్‌లో కొత్త ఐటి కంపెనీలు విరివిగా వస్తున్నాయి.
తెలంగాణలో యానిమేషన్
ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా యానిమేషన్ గేమ్స్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తోంది. దీనివలన కొత్త ఐటి కంపెనీలు తెలంగాణకు తరలివస్తున్నాయి. తెలంగాణలో 3.50 లక్షల మందికి ప్రత్యక్షంగా, 10 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభించాయి. తెలంగాణలో 65 వేల కోట్ల రూపాయల ఐటి ఉత్పత్తులు జరుగుతున్నాయి. బెంగళూరు, చెన్నై తరువాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.
ఏపిలో పెరగని ఐటి ఉత్పత్తులు
కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఐటి ఉత్పత్తుల్లో ప్రగతి కనిపించడం లేదు. రాష్ట్రం నుంచి సుమారు 2,000 కోట్ల రూపాయల ఐటి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. వీటిని కనీసం మూడు రెట్లు చేయడానికి ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నప్పటికీ, అవి కేవలం కాగితాలకే పరిమితం అవడం వలన ఉత్పత్తులు పెరగడం లేదు. వాస్తవానికి గడచిన మూడు సంవత్సరాల్లో 10 శాతానికి మించి ఐటి ఉత్పత్తులు పెరగలేదని ఐటి కంపెనీల యజమానులు తెలియచేస్తున్నారు. మొత్తానికి నవ్యాం ధ్రలో పాలసీలు మారినా.. ప్రగతి మాత్రం కానరావడం లేదు.