బిజినెస్

మొబైల్ ఫోన్ యాక్సిసరీస్ విభాగంలోకి బ్లాపుంక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: జర్మనీకి చెందిన వినియోగదారుల లైఫ్ స్టైల్ వస్తువుల టెక్నాలజీ బ్రాండ్ బ్లాపుంక్ట్.. బుధవారం భారత్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయంగా బ్లాపుంక్ట్ మొబైల్ ఫోన్ యాక్ససరీస్‌ను భారత్‌లో ఆవిష్కరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ బ్లాపుంక్ట్ బ్రాండెడ్ ఉత్పత్తులను భారతీయ మార్కెట్లో అమ్మడానికి ఐటి, టెలికామ్ ఉత్పత్తుల పంపిణీ సంస్థలు విదుర్ అండ్ కో ఒప్పందం కుదుర్చుకున్నాయ.
క్రిమి సంహారిణి కోనికను
ఆవిష్కరించిన ధనూక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 5: శిలీంద్ర, బ్యాక్టీరియా సంహారిణి కోనికను తెలుగు రైతుల కోసం ధనూక అగ్రిటెక్ సంస్థ ఆవిష్కరించింది. పర్యావరణ అనుకూలమైనదంటూ పలు వ్యవసాయ వర్శిటీలు కోనికను సిఫార్సు చేశాయని సంస్థ చైర్మన్ ఆర్‌జి అగర్వాల్ తెలిపారు. వరి పంటకు అగ్గి తెగులు వ్యాధిని నివారించేందుకు కోనిక సమర్థవం తంగా పనిచేస్తుందన్నారు. కాగా, టమోటా, మిరప, దానిమ్మ వంటి పంటలపై వందకుపైగా పరిశోధనలను ధనూక నిర్వహించింది.
‘వాణిజ్య సంబంధాల అభివృద్ధికి కృషి చేస్తా’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జర్మనీ మధ్య ఆర్థిక, పారిశ్రామిక సంబంధాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని సియాంట్ వ్యవస్థాపకుడు, ఐటి దిగ్గజం బివిఆర్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీకి హైదరాబాద్‌లో గౌరవ కాన్సుల్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్మనీ తనపై నమ్మకంతో ప్రతిష్ఠాత్మక బాధ్యతలు అప్పగించిందన్నారు.