బిజినెస్

‘సిర్పూర్’ పునరుద్ధరణకు వెస్ట్‌కోస్ట్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 25: సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు అవకాశాలు మెరుగయ్యాయి. కోల్‌కతాకు చెందిన వెస్ట్‌కోస్ట్ పేపర్ మిల్ లిమిటెడ్ సిర్పూర్ మిల్లును పునరుద్ధరించేందుకు ఆసక్తి చూపించింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటిశాఖ మంత్రి కె తారక రామారావు, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అధికారుల బృందం మంగళవారం కోల్‌కతాలో వెస్ట్‌కోస్ట్ కంపెనీ ఎండి, చైర్మన్ ఎస్‌కె బంగూర్‌ను కలిసి పునరుద్ధరణపై ప్రాథమికంగా చర్చించారు. త్వరలోనే హైదరాబాద్‌లో సమావేశమై అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు.
నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1936లో సిర్పూర్ పేపర్ మిల్లును ఏర్పాటు చేశారు. దాదాపు మూడు వేల మంది ఈ పరిశ్రమలో పని చేసేవారు. అయతే 2014లో పరిశ్రమ మూత పడింది. ఈ క్రమంలో ప్రాథమిక చర్చల కోసం మంత్రుల బృందాన్ని వెస్ట్‌కోస్ట్ కంపెనీ కోల్‌కత్తాకు ఆహ్వానించింది. దీంతో మంత్రులు వెళ్లగా, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ కూడా ఈ బృందంలో ఉన్నారు.
ఫిక్కి ఇనె్వస్టర్ల సమావేశంలో మంత్రులు
కోల్‌కతాలోని ప్రముఖ పెట్టుబడి దారులతో మంత్రి కెటిఆర్ మంగళవారం సమావేశం అయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానం గురించి వివరించిన కెటిఆర్.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను ఉపయోగించుకోవాలని చెప్పారు.
ఐటి, ప్లాస్టిక్, కెమికల్స్, వౌలిక వసతుల రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయమైన గమ్యస్థానమని తెలిపారు. ఐటి రంగంలో ఆఫ్టిక్ ఫైబర్ తయారీకి ముందుకు వచ్చే కంపెనీలకు మిషన్ భగీరథతో ఇవ్వనున్న ఇంటింటికి ఇంటర్‌నెట్ కార్యక్రమం మంచి అవకాశం అన్నారు. సమావేశానికి కోల్‌కతాలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరవగా, తెలంగాణలో పర్యటించేందుకు త్వరలోనే ఒక ప్రతినిధి బృందాన్ని పంపిస్తామని వారు హామీనిచ్చారు.