బిజినెస్

గ్రూప్-ఎలోకి మారనున్న చోళమండలం, ఫైజర్ సూచీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిఎస్‌ఇ వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలో ప్రధాన స్టాక్ ఎక్స్‌చేంజి అయిన బిఎస్‌ఇ (బాంబే స్టాక్ ఎక్స్‌చేంజి) జనవరి 4వ తేదీ నుంచి చోళమండలం ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్, ఫైజర్ కంపెనీల సూచీలు సహా ఐదు సంస్థల సూచీలను గ్రూప్-ఎలోకి మార్చనుంది. దేశంలోని 300 అగ్రశేణి కంపెనీలతో కూడిన గ్రూప్-ఎలోకి బదిలీ కానున్న ఇతర సూచీల్లో కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ లిమిటెడ్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్, బ్లూడార్ట్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ సూచీలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రూప్-బిలో ఉన్న ఈ ఐదు కంపెనీల సూచీలను పీరియాడిక్ రివ్యూలో భాగంగా 2016 జనవరి 4వ తేదీ నుంచి గ్రూప్-ఎలోకి బదిలీ చేయనున్నట్లు బిఎస్‌ఇ ఒక సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం గ్రూప్-ఎలో ఉన్న కైలాష్ ఆటో ఫైనాన్స్, పిఎంసి ఫిన్‌కార్ప్, గీతాంజలి జెమ్స్ కంపెనీల సూచీలను గ్రూప్-బిలోకి మార్చనున్నట్లు బిఎస్‌ఇ తెలిపింది. పెట్టుబడిదారులకు మార్గనిర్ధేశం చేసేందుకు బిఎస్‌సి వివిధ సంస్థల సూచీలను గ్రూప్-ఎ, గ్రూప్-బి, గ్రూప్-టి తదితర కేటగిరీలుగా విభజించి పెట్టుబడిదారులను అధికంగా ఆకర్షించే 300 సూచీలను గ్రూప్-ఎలో చేర్చిన విషయం విదితమే.