కృష్ణ

బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్‌కు పెరుగుతున్న జనాదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం వివిధ రకాల వినూత్న ఆకర్షణీయమైన పథకాలతో సామాన్య ప్రజల ముంగిటకు కూడా చేరుతున్నదని బిఎస్‌ఎన్‌ఎల్ జిల్లా సీనియర్ జనరల్ మేనేజర్ వి.సుందర్ అన్నారు. కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి నవంబర్ మాసాంతం వరకు కొత్తగా 53వేల 495 మంది మొబైల్ వినియోగదారులు పెరిగారని దీంతో వీరి సంఖ్య 5 లక్షల 73వేల 812కు చేరిందన్నారు. నూతన సంవత్సరంలో ఫ్రీ ఇన్‌కమింగ్ రోమింగ్ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. ల్యాండ్ లైన్ ఫోన్‌కు రాత్రి 9 నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు ఉచితంగా ఎక్కడికైనా ఏ నెట్‌వర్క్ ఫోన్‌కైనా ఫోన్ చేసుకోవచ్చన్నారు. ఇటీవలే ప్రవేశపెట్టిన ఆకర్షణీయమైన ప్రీ పెయిడ్ ప్లాన్ అమూల్యకు విశేష స్పందన లభిస్తున్నదన్నారు. ఎస్‌టిడి, లోకల్ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా సెకనుకు ఒకపైసా, రాత్రివేళ ఎస్‌టిడి లోకల్ కాల్స్ ఏ నెట్‌వర్క్‌కైనా నిమిషానికి 20 పైసలు జాతీయ రోమింగ్‌లో ఇన్‌కమింగ్ ఉచితమని అన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అన్నివేళలా నమ్మకమైన నెట్‌వర్కతో విస్తృతమైన కవరేజ్ అందిస్తున్నదన్నారు. విలేఖరుల సమావేశంలో ల్యాండ్ ఫోన్ డిజిఎం కె.రాంప్రసాద్, ఫైనాన్స్ డిజిఎం ఎన్‌వి రావు, అడ్మినిస్ట్రేషన్ డిజిఎం కె.శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.