మెయన్ ఫీచర్

విఫలమవుతున్న బిటి విత్తనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోన్‌శాంటో మళ్లీ వార్తల్లోకి వచ్చిం ది. బహుళ జాతి సంస్థల వల్ల కలిగే దుష్ప్రయోజనాలను నిరోధించే ‘కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా’ (సిసిఐ)..మోన్‌శాంటో జాయింట్ వెంచర్ భారత్‌కు జన్యుపరివర్తన విత్తనాల (జిఎం సీడ్స్) సరఫరాలో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు కాంపిటిషన్ చట్టంలోని 3(4), 4 సెక్షన్ల ప్రాథమిక దుర్వినియోగంపై విచారణ జరపాలని ఆదేశించింది. ఈ విచారణంను సిసిఐ డైరెక్టర్ జనరల్ చేపడతారు. అంతేకాదు మోన్‌శాంటోపై వివిధ రాష్ట్రప్రభుత్వాలు, స్థానిక విత్తన ఉత్పత్తిదారులు కూడా ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా మోన్‌శాంటో విధించే రాయల్టీ చార్జీలు భరించలేని స్థాయి లో ఉన్నాయన్న ఆరోపణలపైనే ఈ కేసులు నడుస్తున్నాయి. గతంలోని కేసుల్లో మోన్ శాంటో తాను ‘ట్రైట్ ఫీజు’ (పత్తి హైబ్రిడ్ విత్తనాల తయారీలో తన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడటం వల్ల విధించే ఫీజు)ను మా త్రం వసూలు చేస్తున్నాను తప్ప, రాయల్టీ కాదని వాదించింది.
అసలు వాస్తవం ఏమంటే దేశీయ రైతులను తాను మోసం చేయకుండా భారత్‌లోని చట్టాలు అడ్డుకుంటున్నాయనేది మోన్‌శాంటో అభిప్రాయం. 1995, మార్చి 10న మహికో (మోన్‌శాంటో-మహికో) 100 గ్రాముల పత్తివిత్తనాలను మార్కెట్లోకి తెచ్చింది. ఈ రకంలో ‘మోన్531-బిటి’ జీన్ ఉంటుంది. దీన్ని భారత్‌లోకి ప్రవేశపెట్టే ముందు ‘‘జెనిటిక్ ఇంజినీరింగ్ అప్రైజల్ కమిటీ’’ (జిఈఏసీ) అనుమతి తీసుకోలేదు. ‘ఎంఓఎన్531 జన్యువును భారత్‌లోకి అక్రమంగా రవాణా చేసి మోన్‌శాంటో- మహికో సంస్థ దేశంలో పెద్ద ఎత్తున, మొత్తం తొమ్మిది రాష్ట్రాల్లోని 40 సువిశాల క్షేత్రాల్లో పరిశోధనలు చేసింది. కేవలం మనదేశంలో బీటీ కాటన్ విత్తనాల అమ్మకాల్లో ఆధిపత్యం సాధించాలన్న ఉద్దేశంతోనే మోన్‌శాంటో ‘ఎంఓఎన్ 531’ జన్యువును మనదేశంలోకి స్మగుల్ చేసింది. ఇందుకు జిఇఏసీ అనుమతి పొందలేదు. 1986 పర్యావరణ పరిరక్షణ చట్టంలోని 7వ అధికరణ ఏం చెబుతున్నదంటే..‘‘జిఇఎసి అనుమతి లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రమాదకరమైన సూక్ష్మ జీవులు లేదా జన్యు ఇంజినీరింగ్‌కు గురిచేసిన జీవులు/ పదార్థాలు లేదా కణాలను దిగుమతి, ఎగుమతి, రవాణా, ఉపయోగించడం, అమ్మకాలు జరపడం, శుద్ధి చేయడం వంటివి నిషిద్ధం.’’ ఎందుకంటే ‘‘జిఎంఓ ట్రైట్స్’’ ఒక్కసారి వాతావరణంలోకి ప్రవేశించాయంటే వాటిని నియంత్రించడం లేదా ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు.
దేశంలోని బహిరంగ మార్కెట్లో ట్రైల్స్ ద్వారా రూపొందిన జన్యు ఇంజినీరింగ్ పత్తి విత్తనాల అమ్మకాలు జరిగాయి. కొన్ని రాష్ట్రా ల్లో అయితే ఈవిధంగా ‘ట్రైల్స్’కు ఉపయోగించిన క్షేత్రాల్లో మరుసటి సీజన్‌లోనే గోధుమ, పసుపు, వేరుశనగ వంటి పంటలను పండించారు. ఇది ‘బయో సేఫ్టీ గైడ్‌లైన్స్(1994)’లోని 9వ పేరాను ఉల్లంఘించడమే. ఈ పేరాలో ‘‘జన్యు మార్పిడికి గురి చేసిన మొక్కలను నూర్పిడి అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలను’’ వివరించారు. దీని ప్రకారం ‘జిఎంఓ ట్రైల్స్’ చేపట్టిన వ్యవసాయ క్షేత్రాన్ని కనీసం ఏడాది కాలంపాటు ఏవిధమైన పంటలు పండించకుండా బీడుగా వదిలేయాల్సి ఉంటుంది.
భారత చట్టాలను ఉల్లంఘించడం, దేశం జన్యుపరమైన కష్టనష్టాలను ఎదుర్కొనాల్సి రావడానికి కారణమయ్యారంటూ, రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ (ఆర్‌ఎఫ్‌ఎస్‌టిఇ) సంస్థవారు, మోన్‌శాంటో, మహికో సంస్థలకు వ్యతిరేకంగా 1999లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని..జిఎంఓల వినియోగానికి 1989 లో రూపొందించిన నియమనిబంధనలకు ఈ సంస్థల చర్యలు వ్యతిరేకంగా ఉన్నాయ ని సంస్థ తన పిటిషన్‌లో పేర్కొంది. భారత చట్టాలు ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు, వ్యవసాయంపై పేటెంట్లను అంగీకరించవు. ఇవి మోన్‌శాంటోకు పెద్ద అడ్డంకిగా మారాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైన దగ్గరినుంచి, తన మేధోపరమైన హక్కుల వ్యవస్థ కొనసాగుతున్న తరుణంలో, భారత్ తన చట్టాల్లో మార్పులు తీసుకొని రావాలని, అమెరికా ప్రభుత్వం ద్వారా తీవ్రస్థాయిలో వత్తిళ్లు తీసుకొని వస్తోంది.
మోన్‌శాంటో-మహికో బయోటెక్ (ఎంఎంబి) లిమిటెట్ మనదేశ చట్టాలకు విరుద్ధంగా బీటీ పత్తిపై రాయల్టీలను వసూలు చేస్తున్నది. ముఖ్యంగా ‘‘టెక్నాలజీ ఫీజు’’, ‘‘ట్రైట్ ఫీజు’’ల పేరుతో దేశంలోని చిన్నకారు రైతుల నుంచి 900 మిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేస్తున్నది. ఇంతపెద్ద మొత్తాలు చెల్లించి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. 2006లో 450 గ్రాములు బిటి పత్తి విత్తనాల ధర రూ.1600 కాగా, దానికి 80 శాతం అదనంగా అంటే దాదాపు రూ.1250 లు ‘ట్రైట్’్ఫజుగా ఎంఎంబి వసూలు చేసిం ది. మరి మోన్‌శాంటో తన కుత్సిత వ్యాపార విధానాలతో ప్రత్యామ్నాయ విత్తన వనరులను ధ్వంసం చేయకముందు (స్థానిక హైబ్రిట్ విత్తన సరఫరాతో పాటు) పై మొత్తాన్ని చెల్లిస్తే రైతులకు 5-9 కిలోల విత్తనం లభించేది.
ఎంఎంబి అనుసరిస్తున్న అనుచిత వ్యాపార విధానాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కమిషన్ (ఎంఆర్‌టిపిసి)కు ఫిర్యాదు చేసింది. అమెరికా రైతులకు విధించే చార్జ్‌లకంటే తొమ్మిది రెట్లు అధిక మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రైతులనుంచి ఎంఎంబి వసూలు చేస్తున్నదని ఈ ఫిర్యాదులో పేర్కొంది. దీనికి సమాధానంగా ఎంఎంబి వాదిస్తూ, బీటీ పత్తిపై పరిశోధన అభివృద్ధి ఖర్చులను రైతుల నుండి వసూలు చేస్తున్న మాట వాస్తవమేనని, రాయల్టీ రూపంలో రైతులపై దీన్ని విధిస్తున్నట్టు అంగీకరించింది.
భారత రైతులు ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొనడానికి మోన్‌శాంటో అనుసరించే క్రూరమైన విధానాలే ప్రధాన కారణం. రైతులు తమ కమతాలను తాకట్టు పెట్టి మరీ బీటీ పత్తి విత్తనాలను, మొక్కలపై వాడే రసాయనాలను కొనుగోలు చేశారు. అయితే తక్కువ క్రిమిసంహారక మందుల వాడకంతోనే అధిక దిగుబడులు సాధించవచ్చునని కంపెనీ చేసిన ప్రచారం, ప్రచారంగానే మిగిలిపోయింది. తగినన్ని దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. 1995 నుంచి మోన్‌శాంటో మనదేశంలోకి బీటీ పత్తిని అక్రమంగా ప్రవేశింపజేసిన దగ్గరినించి, ఆత్మహత్యలు చేసుకున్న 3 లక్షలమంది రైతుల్లో, 84 శాతం అంటే 252,000 మంది మోన్‌శాంటో బీటీ పత్తి విత్తనాల బాధితులే. ఒకపక్క భారత ప్రభుత్వం మోన్‌శాంటోపై కోర్టులో కేసు దాఖలు చేయాలని భావిస్తుంటే, మహారాష్ట్ర ప్రభుత్వం బుల్‌డనలో ఒక పెద్దమోన్‌శాంటో హబ్‌ను ఏర్పా టు చేయడానికి వీలుగా ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవడం కంటె వైపరీత్య మేముంటుంది? పైగా దీన్ని ‘‘మేక్ ఇండియా వీక్’’ సందర్భంగా ప్రకటించారు. మన దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, భారత రైతులు ఉసుర్లు తీస్తూ, వ్యవసాయాన్ని, ఆహార భద్రతను విధ్వంసం చేయడమే కాకుండా, మన చట్టాలను దారుణంగా ఉల్లంఘిస్తున్న ఒక కార్పొరేట్ కంపెనీని ‘మేక్ ఇన్ ఇండియా’ చిహ్నంతో ఏవిధంగా సత్కరిస్తారు?
తలబిరుసుతనంతో భారత చట్టాలను ఉల్లఘించి, మన నియంత్రణా వ్యవస్థలకు అవినీతి తెగులును సోకిస్తున్న మోన్‌శాంటోను తప్పనిసరిగా బాధ్యురాలిని చేయవలసిందే. బీటీ పత్తి విఫలమైన నేపథ్యంలో రైతులకు, టెక్నాలజీ ఫీజు రూపంలో పెద్ద మొత్తాన్ని చెల్లించిన మన విత్తన కంపెనీలకు మోన్‌శాంటోచేత పెద్ద మొత్తంలో నష్టపరిహరం చెల్లింపజేయాలి. ముఖ్యంగా తాను చెబుతున్న టెక్నాలజీ విఫలమైన నేపథ్యంలో ఈ చర్య తీసుకొనవలసిందే. మోన్‌శాంటో విత్తనాలను, రసాయనాలను అమ్మే ఏజెంట్లకు తమ పొలాలను కోల్పోయిన రైతులకు, వారి వారి భూములను తిరిగి ఇప్పించాల్సిదే. భారత రైతుల నుంచి, విత్తన కంపెనీలనుంచి చట్టవిరుద్ధంగా వసూలు చేసిన రాయల్టీని కూడా మోన్‌శాంటో తిరిగి చెల్లించాలి. తన ప్రతిష్టాత్మక ఉత్పత్తి అని చెబుతున్న బీటీ విత్తనాలు ఏడాదికేడాదికి దేశంలో విఫలమవుతున్నాయి. మరోపక్క విదర్భలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. మరి కంపెనీ లాభాలుకూడా క్షీణిస్తున్న తరుణంలో ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టిందంటే, అందుకు తన మోనోపలీని కాపాడుకోవడానికి తప్ప మరో కారణం లేదు.
భారత్‌లో వైవిధ్యం ఎక్కువ. అందువల్ల, ‘హెర్బిసైడ్ టోలరెన్స్’ (హెచ్‌టి), జీఎం రకాల పంటలను అనుమతించకూడదని, సాంకేతిక నిపుణుల కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మరి జీఈఏసీ అనుమతించిన బేయర్స్ హెర్బిసైడ్ టోలరెంట్ టెర్మినేటర్ మస్టర్డ్‌పై మోన్‌శాంటో ఆధారపడటం, సాంకేతిక నిపుణుల కమిటీ సిఫార్సులను ధిక్కరించినట్టు కాదా? బేయర్స్ హెచ్‌టి టెర్మినేటర్ మస్టర్డ్‌ను అనుమతించడమంటే, హెర్బిసైడ్‌లను తట్టుకునే పంటల వెల్లువకు ద్వారాలు తెరచినట్లే. ఇది భారత వ్యవసాయ సంక్షోభాన్ని మరింత దిగజార్చడమే కాకుండా, భారత ఆహార భద్రతను మరింత బలహీనపరుస్తుంది. హెర్బిసైడ్ టోలరెన్స్‌కు, మోన్‌శాంటో వారి గ్లైఫోసేట్ ఆధారిత రౌండప్ హెర్బిసైడ్‌కు పెద్ద తేడా ఏమీ లేదు. గ్లైఫోసేట్ ప్రపంచ వ్యాప్తంగా కలుపును అరికట్టడంలో దారుణంగా విఫలమైంది. దీనిఫలితంగా ‘సూపర్ కలుపు మొక్కలు’ పుట్టుకొచ్చాయి! ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లైఫోసేట్‌ను కార్సినోజెన్‌గా వర్గీకరించింది. కార్సినోజెన్ క్యాన్సర్ కారకం. దీన్ని గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా వాడుతున్నారు. ఫలితంగా గ్లైఫోసేట్‌ను వాడిన గ్రామాల్లో క్యాన్సర్ వ్యాధి విపరీతంగా పెరిగిపోయింది. మరో విఫలపైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, దానికి సంబంధించిన విషాలను అనుమతిస్తే దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోవడమే కాదు, మన రైతులను పీడించి లాభాలను గడించడానికి కూడా అనుమతించినట్లే అవుతుంది. దీనివల్ల మనదేశాన్ని విఫలదేశంగా మార్చడమే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా అపకారం చేసినవారమవుతాం.

-వందనా శివ