జాతీయ వార్తలు

తమిళనాడులో బంద్‌ : స్తంభించిన రవాణా వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కావేరి జలాల వివాదంపై తమిళనాడులో విపక్షాలు, రైతు సంఘాల పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు తిరగకపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. బంద్‌ వల్ల సాధారణ జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతబడ్డాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కోయంబత్తూరు, చెన్నైలోని ప్రధాన రహదారులు నిర్మునుష్యంగా మారాయి. తమిళనాడు, కర్ణాటక సరిహద్దులో పోలీసులు భారీగా మోహరించారు. బంద్‌కు తమిళ సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి.