బిజినెస్

మానవీయ కోణంలో బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ యోచన
తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
హైదరాబాద్, డిసెంబర్ 29: మానవీయ కోణంలో బడ్జెట్‌కు రూపకల్పన చేస్తున్నట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. సంక్షేమానికి 35 వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నా రు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ 98వ వార్షికోత్సవ సమావేశంలో ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప ఆర్థిక వేత్తలకు నిలయం అయిన ఈ దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలన్నారు. మిషన్ కాకతీయ పేరుతో 46వేల చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నామని, 12వేల కోట్ల రూపాయల నుంచి 15వేల కోట్ల రూపాయల వరకు వ్యయం చేస్తున్నట్టు చెప్పారు. విద్యుత్ రంగంలో కేవలం 18 నెలల కాలంలోనే కోతలు లేని స్థితికి చేరుకున్నట్టు చెప్పిన ఈటల.. రాబోయే రోజుల్లో వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపారు. కీలకమైన వ్యవసాయ రంగాభివృద్ధిని విస్మరించబోమన్నారు. విత్తన రంగంలో తెలంగాణను సీడ్ బౌల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ఐటి రంగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపేందుకు జరుగుతున్న కృషిని వివరించారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో విధానానికి అనూహ్య స్పందన వచ్చినట్టు చెప్పారు. ఉపాధి రంగంలో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, మానవ వనరులను నాణ్యమైన, సమర్థవంతమైన సంపదగా తీర్చిదిద్దకపోతే ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావిస్తోందన్నారు. విద్య అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుందని అందుకే కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యా విధానం ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. కార్పొరేట్ వైద్యం రోజు రోజుకు భారం అవుతున్నందున ప్రజలకు ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. అభివృద్ధి అంటే రోడ్లు భవనాల నిర్మాణం మాత్రమే కాదని సమాజంలో అందరూ గౌరవంగా సమానంగా బతికినప్పుడే నిజమైన అభివృద్ధి అన్నారు. తెలంగాణలో అందరూ గౌరవంగా బతికే విధంగా, మానవీయ కోణంలో తమ బడ్జెట్ ఉంటుందని ఈటల స్పష్టం చేశారు.