కృష్ణ

లక్కీ నెంబర్ బడ్జెట్ పేరు గొప్ప ఊరు దిబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ, మార్చి 10: రాష్ట్ర ఆర్థికమంత్రి శాసనసభలో ప్రవేశపెట్టిన రూ.1,35,689.99 కోట్ల బడ్జెట్ లక్కీ నెంబర్‌గా మాత్రమే కనిపిస్తోందనీ, బడ్జెట్‌ను ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి లోటును పూడ్చేదెలాగో చెప్పలేకపోయారని బడ్జెట్ ప్రసంగం ‘పేరు గొప్ప-ఊరు దిబ్బ’గా కొనసాగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. దాసరి భాగభూషణరావు భవన్‌లో గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో కె.రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌ను అత్యంత భారీగా ప్రవేశపెట్టారు. 20వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉందని చెప్పారు. ఈ లోటును భర్తీ చేయడానికి మరోసారి పన్నుల భారాన్ని ప్రజలపై మోపే విధంగా బడ్జెట్ పూర్తిపాఠం కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఏ మాత్రం వెసులుబాటు కల్పించకపోగా పన్నుల భారం పెంచాయి. రుణమాఫీకి రూ.3,150 కోట్లు మాత్రమే కేటాయించారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పోలవరం నిర్మాణాన్ని 2018 నాటికల్లా పూర్తిచేస్తామని చెబుతుంటే, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్‌లో రూ.3,660 కోట్లు మాత్రమే కేటాయించి 2018 నాటికి పోలవరం మొదటిదశ పూర్తిచేస్తామంటున్నారు. కరువు నివారణకు రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారు.