రాష్ట్రీయం

నెలాఖరు వరకూ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

14న బడ్జెట్ ప్రతిపాదన * ఆదివారాలూ పనిచేయనున్న తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్

హైదరాబాద్, మార్చి 11: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఆదివారాలూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 14న రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సభలో బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం చర్చ ప్రారంభమవుతుంది. 13వ తేదీ ఆదివారం రెండో రోజు కూడా చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది.
14న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ 2016-17 సంవత్సరానికి సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై సభ్యులు అధ్యయనం చేయడానికి వీలుగా మర్నాడు అంటే 15న సెలవు ప్రకటించారు. 16, 17, 18, 19 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. 19వ తేదీన ఆర్థిక మంత్రి ఈటల చర్చకు సమాధానమిస్తారు. 20, 21, 22 తేదీల్లో పద్దుల (డిమాండ్ల)పై చర్చ, ఓటింగ్ జరుగుతుంది.
23న హోళి పండుగ సెలవు. 25న గుడ్-ప్రైడే సెలవు కావడం వల్ల మధ్యన ఒక రోజు 24న కూడా సెలవుగా బిఎసి నిర్ణయించింది. 26, 27, 28 తేదీల్లో పద్దులపై చర్చ జరుగుతుంది. 29న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది. కాగా విపక్షాల సభ్యుల వినతి మేరకు 30, 31వ తేదీల్లో కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇలాఉండగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలు ప్రతిపాదించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల విపక్షాల సభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడంలోని ఉద్దేశమే దెబ్బతింటుందని వారు తెలిపారు. అందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిస్పందిస్తూ అంత ముఖ్యమైన అంశం ఏదైనా ఉంటే ప్రభుత్వమే ముందుకు వచ్చి చర్చకు అనుమతిస్తుందని, ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్ తర్వాతే వాయిదా తీర్మానాలను కొనసాగించేందుకు సహకరించాలని కోరారు.
20న కౌన్సిల్ లేదు
ఇలాఉండగా శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ ఎ. స్వామిగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండా ఖరారైంది. ఆదివారాలూ అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాలనుకున్నా, 20వ తేదీ ఆదివారం మాత్రం కౌన్సిల్‌కు సెలవు దినంగా నిర్ణయించారు.