తెలంగాణ

తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేసీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు శుక్రవారం శాసనసభలో 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఓ ముఖ్యమంత్రి బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం తెలంగాణలో ఇదే తొలిసారి. ఆర్థిక శాఖ కూడా కేసీఆర్‌ వద్ద ఉండటంతో ఆయనే సభలో 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2018-19లో తెలంగాణ వృద్ధిరేటు 10.6 శాతంగా ఉందని కేసీఆర్‌ తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్ల పధకం తన హృదయానికి దగ్గరైనదని అన్నారు. బడ్జెట్‌ సందర్భంగా ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు. 2018 డిసెంబర్ 11లోపు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్రక‌టించారు. సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు.