తెలంగాణ

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై తెలంగాణ అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. బడ్జెట్‌పై చర్చను కాంగ్రెస్ శాసనసభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభిస్తూ మహాదేవ్‌పూర్, కాటారం, పెద్దంపేట్ సబ్‌స్టేషన్ల పరిధిలో 24 గంటలు కరెంటు సరఫరా కావటం లేదని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ ఈ మూడు సబ్‌స్టేషన్ల పరిధిలో గత 20 రోజుల నుంచి కరెంటు సరఫరాకు సంబంధించిన రికార్డులను తెప్పించుకుని పరిశీలించామని కరెంటు సరఫరా ఎక్కడా ఆగలేదని అన్నారు. కొద్దిసేపు పోవటం సహజమని, అది ముఖ్యమంత్రి ఇంట్లోనూ జరుగుతుందని, శ్రీధర్ బాబు అవాస్తవాలు చెప్పటం తగదని అన్నారు. ఈ చర్చకంటే ముందు పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును ఆ శాఖ మంత్రి ఎర్రబెల్ల దయాకరరావు ప్రవేశపెట్టారు. జీఎస్టీ సవరణ బిల్లును కూడా మంత్రి వేముల ప్రశాంతి రెడ్డి ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో మృతిచెందిన మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ, ఇతర శాసనసభ్యులకు సభ నివాలులర్పించింది.