తెలంగాణ

సామాన్యులకు ఉపయోగపడని బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* శాసన మండలిలో బిజెపి సభ్యుడు రామచంద్రరావు
* అమోఘమైన బడ్జెట్ అంటూ అధికార పక్షం కితాబు
హైదరాబాద్, మార్చి 17: రాష్ట్ర ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరానికి లక్షా 35వేల పైచిలుకు కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ కనీసం అనాధల ఆకలి కూడా తీర్చలేదని, సామాన్యులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చేలా లేదని బిజెపి సభ్యుడు ఎన్. రామచంద్రరావు శాసన మండలిలో గురువారం వ్యాఖ్యానించారు. ఉదయం పది గంటలకు చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన ప్రారంభమైన శాసన మండలి సమావేశంలో భాగంగా తొలుత ప్రశ్నోత్తరాల పర్వాన్ని నిర్వహించి, ఆ తర్వాత బడ్జెట్‌పై చర్చకు అనుమతించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష, అధికార పక్షాలకు చెందిన సభ్యుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. పేదలకు పనికిరాని బడ్జెట్ అని బిజెపి విమర్శించగా, ఇది అమోఘమైన బడ్జెట్ అంటూ అధికార పార్టీ సభ్యులు కితాబు ఇచ్చారు. బిజెపి సభ్యుడు ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమంతో పాటు ప్రజల జీవితంతో ఎంతో ముడిపడి ఉన్న విద్య, వైద్య రంగాలకు కూడా ఆశించిన స్థాయిలో కేటాయింపులు జరపలేదని వ్యాఖ్యానించారు. అన్ని రంగాలకు కేటాయింపులు తగ్గాయని వివరించారు. విద్యారంగానికి మరిన్ని కేటాయింపులు జరిపితే బాగుండేదన్నారు. ఈ రంగంలో గతంలో అవకతవకలు జరిగాయని ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యానించారని, అక్రమాలు చోటుచేసుకున్నాయని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతామా? వారిని ఇబ్బందులకు గురిచేస్తామా? అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌లో ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించుకుని, దాన్ని గొప్ప బడ్జెట్‌గా చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఇది పేదల కలలను నిజం చేసేలా లేదని, ఒక రకంగా ఇది ప్రజలకు వల వేసే బడ్జెట్ అని సభ్యుడు రామచంద్రరావు వ్యాఖ్యానించటంతో అధికార పార్టీకి చెందిన సభ్యుడు యాదవరెడ్డి జోక్యం చేసుకుని అభ్యంతరం వ్యక్తం చేయగా, చైర్మన్ ఆయన్ను వారించారు.