తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగాఆర్టీసీ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ జరుగుతుంది. నిరసనకారులు పెద్ద ఎత్తున చేరి ఆందోళన చేస్తున్నారు. అఖిలపక్ష మద్దతు తెలపటంతో అన్ని పార్టీల నాయకులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. ఎక్కడి బస్సులు అక్కడ నిలిచిపోయాయి. పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో నిరసన తెలుపుతున్న న్యూడెమోక్రసీ నాయకుడు పోటు రంగారావును అరెస్టు చేసి వ్యాన్‌లోకి ఎక్కించి డోర్ వేస్తుండగా వేలు డోర్ మధ్యలో నలిగి తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అలాగే నాగోల్ బండ్లగూడ డిపో వద్ద నిరసనకారులు తాత్కాలిక సిబ్బందిని చితకబాదారు. వారు బస్సులు నడపటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బందిని వెంటపడి చితకబాదారు. డీజిల్ పైపులైను పీకివేశారు. టైర్లలోని గాలి తీసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోనికి తీసుకున్నారు.