బిజినెస్

నిధుల వేటలో ఎస్‌కెఎస్, ఇండియాబుల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: సెక్యూరిటైజేషన్ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ 538.11 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ఈ తరహా లావాదేవీ ఇది ఏడోది కావడం గమనార్హం. శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఎస్‌కెఎస్ మైక్రోఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం ఈ ఏడు లావాదేవీల్లో 2,319.93 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. మరోవైపు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీతో 510 కోట్ల రూపాయల నిధులను సమీకరించనుంది. ఈ నెల 23న ఈ ఇష్యూ రానుంది. అదే రోజున ముగియనుంది. ఈ మేరకు వివరాలను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు శనివారం సంస్థ తెలియజేసింది. కాగా, 719 రోజుల నుంచి 1,083 రోజుల వరకు ఈ ఇష్యూ కాలం ఉంటుంది. ఇదిలావుంటే ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్.. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ద్వారా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీతో 65 కోట్ల రూపాయల నిధులను సమీకరించినట్లు శనివారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలిపింది.