బిజినెస్

ద్రవ్యోల్బణం ఆధారంగా సేవింగ్స్ వడ్డీరేట్లుండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, మార్చి 19: ద్రవ్యోల్బణం ఆధారంగా పొదుపు వడ్డీరేట్లుండాలని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. శుక్రవారం చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పిపిఎఫ్, కిసాన్ వికాస్ పత్ర వడ్డీరేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించినది తెలిసిందే. ఈ క్రమంలో ‘సేవింగ్స్ రేటు 9 శాతంగా, ద్రవ్యోల్బణం రేటు 11 శాతంగా ఉంటే పొదుపుదారులకు మిగిలేది ఏమీ ఉండదు. అదే ద్రవ్యోల్బణం 5 శాతంగా, సేవింగ్స్ రేటు 9 శాతంగా ఉంటే పొదుపుదారులకు లాభం.’ అని శనివారం ఇక్కడ ఐఐఎమ్ అహ్మదాబాద్ 51వ స్నాతకోత్సవ వేడుకలో మాట్లాడుతూ భట్టాచార్య అన్నారు. కాగా, విజయ్ మాల్యా వ్యవహారంపై స్పందించేందుకు భట్టాచార్య నిరాకరించారు. మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు రుణాలిచ్చిన ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఎస్‌బిఐ ముందున్నది తెలిసిందే. అత్యధికంగా 1,600 కోట్ల రూపాయలకుపైగా రుణాన్నిచ్చింది.