బిజినెస్

మాల్యాకు ఒక్క అవకాశం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: రుణాల ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాకు ఆ సమస్యల పరిష్కారానికి ఒక్క అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్ షా అభిప్రాయపడ్డారు. అలాగే మీడియా ఈ వ్యవహారంపై అత్యుత్సాహం ప్రదర్శించడం తగదని, దీనికది పరిష్కారం కాబోదన్నారు. శనివారం ఇక్కడ పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంపై మాల్యా తనను తాను ప్రశ్నించుకోవాలని, సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని, ఇందుకు తనకూ ఓ అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మాల్యా.. తిరిగి భారత్‌కు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆమె ఒక్క రాత్రిలో ఈ కేసు పరిష్కారమయ్యేది కాదన్నారు. కొనే్నళ్ల నుంచి డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ వద్ద ఈ కేసు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో మీడియా తీరునూ తప్పుబట్టారీ బయోటెక్నాలజీ దిగ్గజమైన బయోకాన్ చైర్‌పర్సన్, ఎండి. బ్యాంకుల మొండి బకాయిలపైనా, రుణాల ఎగవేతదారులపైనా, ప్రభుత్వం తీరుపైనా అన్నింటిపైనా మీడియా ఒకరకమైన విచారణ జరుపుతోందని, ఇది ఆగాలన్నారు.