బిజినెస్

మళ్లీ ఫ్లిప్‌కార్ట్-స్నాప్‌డీల్ లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/బెంగళూరు, మార్చి 26: భారత ఈ-కామర్స్ రిటైల్ దిగ్గజాలు, ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రత్యర్థులైన ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మధ్య ఆన్‌లైన్ వేదికగా విమర్శలు-ప్రతివిమర్శలు మరింత జోరందుకున్నాయి. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా.. భారత్‌లోకి ప్రవేశించడంపై తాజాగా ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వ్యవస్థాపకులిరువురి మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. ట్విట్టర్ వేదికగా జరిగిన ఈ పరస్పర వాదనల్లోకి వెళితే.. భారత్‌లోకి అలీబాబా రాకపై ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన సచిన్ బన్సల్ ట్వీట్ చేస్తూ ‘్భరత్‌లో నేరుగా తమ కార్యకలాపాలను ప్రారంభించాలని అలీబాబా నిర్ణయించుకోవడాన్ని చూస్తే, ఇప్పటిదాకా భారత్‌లో ఆ సంస్థ పెట్టిన పెట్టుబడులు ఎంతటి దుస్థితిలో ఉన్నాయో అర్థమవుతోంది.’ అన్నారు. స్నాప్‌డీల్‌తోపాటు పేటిఎమ్ తదితర భారతీయ ఈ-కామర్స్ సంస్థల్లో అలీబాబా పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది భారతీయ రిటైల్ మార్కెట్‌లోకి తాము రాబోతున్నట్లు గత వారం అలీబాబా ప్రకటించగా, ఈ నేపథ్యంలో సచిన్ బన్సల్ పైవిధంగా స్పందించారు. అయితే దీనికి ప్రతిస్పందనగా స్నాప్‌డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కునాల్ భల్ ఘాటుగానే ట్వీట్ చేశారు. ‘దాదాపు 5 బిలియన్ డాలర్ల ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువను మోర్గాన్ స్టాన్లీ ఒక్కసారిగా తగ్గించలేదా? దీనివల్ల ఫ్లిప్‌కార్ట్ పరువు టాయిలెట్లలో కలిసిపోలేదా (టాయిలెట్ సీట్ ఐకాన్‌ను పోస్ట్ చేశారు)? మీ వ్యాపారంపై ముందు దృష్టి పెట్టండి. అనవసరమైన వ్యాఖ్యలు మానండి. ఇది మీకు సిగ్గుచేటు (స్మైల్ ఐకాన్‌ను పోస్ట్ చేశారు).’ అని స్పందించారు. కాగా, గత ఏడాది అలీబాబా తదితర సంస్థల నుంచి స్నాప్‌డీల్ 500 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన నేపథ్యంలో దాన్ని అలీబాబా రాకకు ముడిపెడుతూ సచిన్ బన్సల్ కామెంట్ చేస్తే, అంతర్జాతీయ మదుపరులు ఫ్లిప్‌కార్ట్ మార్కెట్ విలువ అధికంగా ఉందని విశ్వసించడంతో మోర్గాన్ స్టాన్లీ ఆ సంస్థ షేర్ల విలువను 27 శాతం తగ్గించడాన్ని గుర్తుచేస్తూ కునాల్ భల్ రెచ్చిపోయారు. మోర్గాన్ స్టాన్లీ చర్యతో తమ సంస్థ మార్కెట్ విలువ 15.2 బిలియన్ డాలర్ల నుంచి 11 బిలియన్ డాలర్లకు పడిపోయిందని ఓ పత్రికా ప్రకటనలో ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది కూడా. అయితే ట్విట్టర్‌లో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఇలా పోట్లాడుకోవడం ఇదే తొలిసారి కాదు. ఏడాది క్రితం నుంచే ఈ తరహా ఆన్‌లైన్ మాటల యుద్ధం మొదలైంది. గతంలో ఇరు సంస్థలు ఒకరిపై ఒకరు తమ కార్యకలాపాలపై, తమతో దోస్తీ కట్టిన సంస్థలపై విమర్శలు గుప్పించుకున్నది తెలిసిందే.