బిజినెస్

వెనక్కి తగ్గేదాకా విశ్రమించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: దేశవ్యాప్తంగా నగల వ్యాపారుల ఆందోళన కొనసాగుతోంది. జిజెఎఫ్, ఎబిజెఎ, జిజెఇపిసి సంఘాలు గత శనివారమే సమ్మెను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ మెజారిటీ సంఘాలు ఇంకా నిరవధికంగా బంద్‌ను పాటిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఆభరణాల వర్తకుల బంద్ 25వ రోజుకు చేరగా, జలంధర్, గుర్గావ్, అహ్మదాబాద్ పాంత్రాల్లో భారీ ఎత్తున వ్యాపారులు ర్యాలీలు నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గత నెల ఫిబ్రవరి 29న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన సాధారణ వార్షిక బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నట్లు ప్రతిపాదించినది తెలిసిందే. దీంతో దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 2 నుంచి దేశవ్యాప్తంగా నగల వ్యాపారులు బంద్ చేపట్టారు. ఇప్పటికే దాదాపు లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయతే గత శనివారం నగల వర్తకుల మధ్య సమ్మె విరమణ విషయంలో బేధాభిప్రాయాలు చోటుచేసుకోగా, అయనప్పటికీ సగానికిపైగా ఆభరణాల వ్యాపారులు నేటికీ సమ్మెను కొనసాగిస్తున్నారు. ‘ఇన్‌స్పెక్టర్ రాజ్’ ఉండబోదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో అఖిల భారత రత్నాలు, ఆభరణాల వాణిజ్య సమాఖ్య (జిజెఎఫ్), అఖిల భారత బులియన్, ఆభరణాల సంఘం (ఐబిజెఎ), రత్నాలు, ఆభరణాల ఎగుమతి ప్రోత్సాహక మండలి (జిజెఇపిసి) సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో తమిళనాడు తదితర రాష్ట్రాల్లో నగల దుకాణాలు తెరుచుకోగా, డిమాండ్ల పరిష్కారార్థం తమ నిరసన కొనసాగుతుందని వ్యాపారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే శనివారం అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒకరోజు బంద్‌ను పాటించారు. కాగా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లోని వర్తకులు మాత్రం బంద్‌ను కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ సుంకాన్ని విధించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసేంతవరకు బంద్ ఆగదని తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలో మూతబడిన తమ దుకాణాల తాళాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఇచ్చే యోచనలో కూడా ఉన్నామని అఖిల భారత బులియన్, జ్యుయెలర్స్, స్వర్ణకారుల సమాఖ్య (ఎఐబిజెఎస్‌ఎఫ్) శుక్రవారం తెలిపింది. మరోవైపు నగల వ్యాపారుల డిమాండ్లపై మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించినది తెలిసిందే. 60 రోజుల్లో ఈ కమిటీ తమ నివేదికను సమర్పించనుంది. బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం రద్దుతోపాటు కొనుగోళ్లకు పాన్ కార్డును తప్పనిసరి చేయడాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వర్తకుల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నాయ.

chitram బంగారు ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని వ్యతిరేకిస్తూ జలంధర్‌లో శనివారం ర్యాలీ నిర్వహిస్తున్న ఆభరణాల వర్తకులు,