బిజినెస్

ఐడిఎస్ విజయవంతం: ఐసిఎఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబరు 4: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యక్తిగత ఆస్తుల ముందస్తు ప్రకటన పథకం (ఐడిఎస్) విజయవతమైందని భారత చార్టర్డ్ అకౌంటెంట్ల సంస్థ (ఐసిఎఐ) అధ్యక్షుడు ఎం దేవరాజారెడ్డి అన్నారు. చార్టర్ట్ అకౌంటెంట్ల అంతర్జాతీయ సమ్మేళనం ఈ నెల 22, 23 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. మంగళవారం ఢిల్లీలో దేవరాజారెడ్డి తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ఈ పథకం మూలంగా ఇప్పటివరకు 71 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. ఈ ఆదాయం మరో ఐదు నుంచి ఆరు శాతం పెరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ఇలా తమ అస్తుల ముందస్తు ప్రకటన ద్వారా తమకు ఎదురయ్యే ఇబ్బందుల నుంచి కొన్ని వేలమంది బయటపడ్డారని, పన్ను చెల్లింపులు చేయకపోతే ఆదాయ పన్నుల శాఖ నుంచి దాడులు ఎదుర్కొవాల్సి వచ్చేదన్నారు. దేశవ్యాప్తంగా ముందస్తు పన్నుల చెల్లింపులు చేయగలిగే పది లక్షల మందిలో సుమారు 64 వేల మంది వరకు తమ ఆదాయం ప్రకటించారని పేర్కొన్నారు.
భారత ఆర్థిక వ్యవస్థలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నారని దేవరాజారెడ్డి అన్నారు. కాగా, ప్రజల్లో ముందస్తు ఆదాయ ప్రకటన, పన్ను చెల్లింపులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో పన్నుల అధారంగా లభించే ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. కాగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరగడానికి రియల్ ఎస్టేట్ పెరగడమే కారణం అని చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా చార్టర్డ్ అకౌంటెంట్ల (సిఏ) సిలబస్‌ను మార్చాలని సంస్థ కౌనె్సల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కొత్త సిలబస్ ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు ఉంచామన్నారు. ముఖ్యం గా సిఏకు 12వ తరగతిని ప్రామాణికంగా తీసుకుంటున్నామన్నారు. దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా, దేశీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఒకే రకమైన అకౌంటింగ్ విధానాన్ని తీసురానున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఏడాది మన దేశంలో 12 వేల మంది చార్టర్డ్ అకౌటెంట్లుగా బయటకు వస్తున్నారని, మన విద్యార్థుల్లో వచ్చే ఐదు సవత్సరాలలో లక్షకుపైగా సిఏలు విదేశాల్లో ఉద్యోగాలలో స్థిరపడతారని ఆయన అంచనా వేశారు. అయతే సిఏ కోచింగ్ పేరుతో విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఏ కోచింగ్ సెంటర్ల మాయలో తల్లిదండ్రులు పడవద్దని ఆయన సలహా ఇచ్చారు. కోచింగ్ పేరుతో విద్యార్థులను బట్టీపట్టే యంత్రాలుగా తయారు చేస్తున్నారని దేవరాజారెడ్డి మండిపడ్డారు.