బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ‘టాటా’ దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని ఆశ్చర్యకరంగా సోమవారం టాటా సన్స్ తొలగించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నష్టాలకు లోనయ్యాయి. పలు టాటా సంస్థల షేర్లు తీవ్ర ఒడిదుడుకులకు గురికావడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 87.66 పాయింట్లు కోల్పోయి 28,091.42 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17.65 పాయింట్లు దిగజారి 8,691.30 వద్ద నిలిచింది. సోమవారం సెనె్సక్స్, నిఫ్టీ సూచీలు లాభపడినది తెలిసిందే. ఇకపోతే మంగళవారం ట్రేడింగ్‌లో టాటా గ్రూప్ షేర్ల విలువ 3 శాతానికిపైగా పతనమైంది. టాటా స్పంజ్ ఐరన్ 3.04 శాతం, టాటా కాఫీ 2.63 శాతం, టాటా స్టీల్ 2.51 శాతం, టాటా గ్లోబల్ బేవరేజెస్ 2.47 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 2.26 శాతం, టాటా కెమికల్స్ 2.09 శాతం, టాటా పవర్ 1.5 శాతం, టాటా ఎగ్జి 1.40 శాతం, టిసిఎస్ 1.20 శాతం, టాటా మోటార్స్ 1.07 శాతం చొప్పున పడిపోయాయి. మొత్తంగా టాటా గ్రూప్ మార్కెట్ విలువ మంగళవారం ఒక్కరోజే 10,688.51 కోట్ల రూపాయలు హరించుకుపోయింది. ఇదిలావుంటే మహీంద్ర అండ్ మహీం ద్ర, గెయిల్, హెచ్‌యుఎల్, ఒఎన్‌జిసి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటిసి లిమిటెడ్ షేర్ల విలువ కూడా 2.72 శాతం నుంచి 1.02 శాతం వరకు దిగజారింది. ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించగా, హాంకాంగ్ నష్టపోతే, జపాన్, చైనా సూచీలు లాభపడ్డాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభపడ్డాయి.

‘6-8 ట్రిలియన్ డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ’
గౌహతి, అక్టోబర్ 25: దేశ ఆర్థిక వ్యవస్థ సామర్థ్యం రాబోయే 15 సంవత్సరాల్లో 6-8 ట్రిలియన్ డాలర్లను తాకుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అన్నారు. ప్రస్తుతం 2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ భారత ఆర్థిక వ్యవస్థ ఎదుట అనేక సవాళ్లున్నాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న సంస్కరణల నేపథ్యంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు 8 శాతంగా నమోదు కావచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అంచనా వేశారు.
విదేశీ ఆస్తులు తెలపాలంటూ మాల్యాకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: విదేశీ ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లోగా వెల్లడించాలని రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాను అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు ఈ మేరకు వివరాలను సమర్పించాలని మాల్యాను సుప్రీం కోరినప్పటికీ, ఆయన ఆ దిశగా తెలియపరచలేదు. ఈ క్రమంలో జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో డియాజియో నుంచి పొందినట్లు భావిస్తున్న 40 మిలియన్ డాలర్ల వివరాలనూ ప్రకటించాలని మాల్యాకు కోర్టు స్పష్టం చేసింది.

భారీ జనరేటర్‌ను
ఆవిష్కరించిన కిర్లోస్కర్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, అక్టోబర్ 25: కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ సంస్థ.. 750 నుంచి 1,010 కెవిఏ వరకు అశ్వసామర్థ్యం (హెచ్‌పి) ఉన్న విద్యుత్ జనరేటర్‌ను ఆవిష్కరించింది. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ జెఎండి ఆర్‌ఆర్ దేశ్‌పాండే మాట్లాడుతూ దేశంలో 30 వేల జనరేటర్లను మార్కెట్‌లో విడుదల చేశామన్నారు. 2 కెవిఏ నుంచి 1,010 కెవిఏ హెచ్‌పి వరకు జనరేటర్లను ఉత్పత్తి చేసే సంస్థ కిర్లోస్కర్ మాత్రమేనన్నారు.
ఎపి ప్రాజెక్టు కోసం టిపిఆర్‌ఇఎల్ ఒప్పందం
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: అనంతపురం సోలార్ పార్కు వద్ద 100 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు కోసం సోలార్ కార్ప్ ఆఫ్ ఇండియాతో విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పిపిఎ)న్ని చేసుకుంది టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టిపిఆర్‌ఇఎల్). పిపిఎ ప్రకారం వచ్చే ఏడాది అక్టోబర్ 16న ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు మొదలవుతాయని టాటా పవర్ ఓ ప్రకటనలో చెప్పింది.