జాతీయ వార్తలు

అగ్నికి ఆహుతైన ట్రావెల్స్‌ బస్సు : బాలుడు సజీవదహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుమ్నాబాద్‌ (కర్ణాటక) : షిర్డీ నుంచి హైదరాబాద్‌ వస్తున్న కావేరి ట్రావెల్స్‌ బస్సు శుక్రవారం ఉదయం అగ్నికి ఆహుతైంది. హుమ్నాబాద్‌ సమీపంలోని ఠాగూర్‌ దాబా వద్దకు రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో తణుకుకు చెందిన విహాన్‌(6) సజీవ దహనమయ్యాడు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కావేరి ట్రావెల్స్‌ బస్సు పాండిచ్చేరి రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో ఆందోళనకారులు నిప్పుపెట్టిఉంటారని తొలుత భావించారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని కర్ణాటక పోలీసులు చెబుతున్నారు. కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో జరుగుతున్న ఆందోళనలకు ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.