బిజినెస్

మూడు నెలల కనిష్టానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. వరుసగా నష్టాలపాలవడం ఇది ఐదోరోజవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ మూడు నెలల కనిష్ట స్థాయికి పతనమైంది. పార్లమెంట్‌లో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర బిల్లుల ఆమోదంపై నెలకొన్న ఆందోళనలు మార్కెట్‌ను కుంగదీశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు ఏడేళ్ల కనిష్టానికి పడిపోవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర చాలా తక్కువగా ఉన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో చమురు ఉత్పాదక దేశాల గ్రూపైన ఒపెక్.. తమ ఉత్పత్తిని తగ్గించబోమని స్పష్టం చేయడంతో విపణిలో ధరలు మరింతగా తగ్గుముఖం పట్టాయి. ఈ ప్రభావంతోనే బిఎస్‌ఇ చమురు, గ్యాస్ సూచీ 2.14 శాతం దిగజారింది. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 219.78 పాయింట్లు క్షీణించి 25,310.33 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 63.70 పాయింట్లు కోల్పోయి 7,701.70 వద్ద నిలిచింది. బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 1.33 శాతం, మిడ్-క్యాప్ 1.17 శాతం చొప్పున నష్టపోయాయి.
రియల్టీ, మెటల్, యుటిలిటీస్, చమురు, గ్యాస్, ఇంధనం, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ షేర్ల విలువ 3.69 శాతం నుంచి 1.46 శాతం దిగజారింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 0.75 శాతం నుంచి 1.89 శాతం క్షీణించాయి.
ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.64 శాతం నుంచి 0.80 శాతం వరకు పతనమయ్యాయి. దీంతో ఈ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌పై పడింది. విదేశీ మదుపరులు సైతం గతకొద్ది రోజులుగా దేశీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నది తెలిసిందే.

పెట్టుబడులపై అమెరికా
వాణిజ్య బృందంతో ఏపి చర్చలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాల పర్యవేక్షణకు అమెరికాకు చెందిన వాణిజ్య ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. అధికారులతో కలిసి ఢిల్లీలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్‌మోహన్ రావు అమెరికా బృందంతో మంగళవారం చర్చలు జరిపారు. రాష్ట్రంలో అపారంగా ఉన్న సహజ వనరులు, కావాల్సినంత కార్మిక శక్తి తదితర అన్ని ప్రాథమిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నందున పెట్టుబడులతో రావలసిందిగా కంభంపాటి బృందంలోని సభ్యులకు సూచించారు. ప్రతి ఒక్క అనుమతి నిర్ణీత వ్యవధిలో లభించేట్లు చర్యలు తీసుకున్నామని ఆయన తెలియచేశారు. తమ ప్రతిపాదనలకు అమెరికా వాణిజ్య బృందం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా కంభంపాటి తెలియచేశారు.

పది నిమిషాల్లో పరిశ్రమలకు రిజిస్ట్రేషన్

ఒంగోలు, డిసెంబర్ 8: పది కోట్ల రూపాయల లోపు పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించుకునే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ ఆధార్ మెమోరాండంతో కేవలం పది నిమిషాల నుండి అరగంట వ్యవధిలోనే ఆన్‌లైన్‌లో పరిశ్రమల రిజిస్ట్రేషన్ చేయించుకునే సదుపాయాన్ని కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పరిశ్రమలు స్థాపించుకునేవారు పంచాయతీ కార్యాలయాల నుండి టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోలు బోర్డు అధికారుల చుట్టు తిరగక్కర్లేకుండాపోయంది. కేవలం ఆధార్, పాన్ నెంబరుతోపాటు, బ్యాంకు అకౌంట్ నెంబరు ఉంటే చాలు పరిశ్రమలు స్థాపించేవారు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే చాలు వెంటనే కేవలం పది నిమిషాల నుండి అరగంట వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్ అయినట్లు వస్తుంది. ఆ కాపీ ఆన్‌లైన్‌లోనే సంబంధిత పరిశ్రమల శాఖకు వచ్చే వీలును కేంద్రప్రభుత్వం కల్పించింది. ఈ విధానం వలన పరిశ్రమల శాఖాధికారులకు కూడా పనిభారం తగ్గించినట్లు అవుతుంది. నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో చేసుకున్న రిజిస్ట్రేషన్‌తో పరిశ్రమల శాఖకు చెందిన అధికారులు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన స్థలాన్ని పరిశీలిస్తారు. ఒకవేళ కొంతమంది నిరుద్యోగులు పరిశ్రమ యూనిట్ లేకుండా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే అధికారులు ఆ రిజిస్ట్రేషన్‌ను డిలిస్ట్‌లో పెట్టనున్నారు. గతంలో పది కోట్ల రూపాయల లోపు పరిశ్రమలను నిరుద్యోగులు ఏర్పాటుచేయాలంటే ముందుగా పంచాయతీ అనుమతితోపాటు, టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోలు బోర్డు అనుమతుల కోసం కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల నిరుద్యోగులు పరిశ్రమలను స్థాపించేందుకు రిజిస్ట్రేషన్ కోసమే కాళ్లు అరిగేలా తిరగాల్సి రావటంతో కొంతమంది పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు వెనకంజ వేసే పరిస్థితి ఉండేది. కాని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ బాధంతా తప్పిపోగా, నిరుద్యోగులు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా పది కోట్ల రూపాయల లోపు పెట్టుబడితో గ్రానైట్, సిన్నింగ్ మిల్స్, కోల్డ్ స్టోరేజిలు, ఆటోమొబైల్, వెల్డింగ్, సిమెంటు బ్రిక్స్ వంటి వాటిని ఏర్పాటు చేసుకుంటూ నిరుద్యోగులు జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తాజా విధానం ద్వారా మరింతమంది నిరుద్యోగులు పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ముందుకు వచ్చే పరిస్ధితి ఉంది. కాగా, గత రెండు నెలల నుండి ఈ విధానం అమలులోకి రావటంతో నిరుద్యోగులు ఆన్‌లైన్ ద్వారానే రిజిస్ట్రేషన్లు పొందుతున్నారని పరిశ్రమల శాఖకు చెందిన ఒక అధికారి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు.