బిజినెస్

ఇక బ్యాంక్ అకౌంట్లలోనే బీడీ కార్మికుల వేతనాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 29: పెద్ద నోట్ల రద్దుతో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమలోనూ అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయని స్పష్టమవుతోంది. బీడీ పరిశ్రమ స్థాపించిన నాటి నుండే గడిచిన కొన్ని దశాబ్దాల కాలంగా కార్మికులకు నగదు రూపంలో నేరుగా వేతనాలు చెల్లిస్తుండగా, మారిన పరిస్థితుల దృష్ట్యా ఇకపై వారి వేతనాలను బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని బీడీ కంపెనీల యాజమాన్యాలు యోచిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే బీడీ కార్మికులకు సంబంధించిన బ్యాంకు ఖాతా పుస్తకాలను సేకరించడం మొదలు పెట్టారు. పాత 500, 1000 రూపాయల నోట్ల చెలామణిని రద్దు చేస్తూ, బ్యాంకులు, ఎటిఎంల నుండి పరిమితంగానే డబ్బులు డ్రా చేసుకునేలా షరతులు విధించడంతో బీడీ యాజమాన్యాలు కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోతున్నాయ. మున్ముందు నగదు రహిత లావాదేవీలే కీలకం కానున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన సంకేతాలు వెలువరిస్తుండడంతో బీడీ సంస్థల యజమానులు వేతనాల పంపిణీ విధానంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించక తప్పని పరిస్థితి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగిన సమయం నుండే బీడీ పరిశ్రమకు నిజామాబాద్ జిల్లా కేంద్ర బిందువు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉండగా, ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రెండున్నర లక్షల మంది బీడీ పరిశ్రమనే నమ్ముకుని బ్రతుకు వెళ్లదీస్తున్నారు. నిజామాబాద్‌తోపాటు మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలలో గ్రామగ్రామాన బీడీ రంగం విస్తరించి కుటీర పరిశ్రమగా విలసిల్లుతోంది. అనేక ఒడిదుడుకులు, సంక్షోభాలను ఎదుర్కొంటూ తన మనుగడను కొనసాగిస్తుండగా, ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు సృష్టించిన సంక్షోభంతో సతమతం అవుతోంది. గత రెండు నెలల నుండి బీడీ కార్మికులకు బట్వాడాలు (వేతనాల చెల్లింపులు) నిలిచిపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బ్రాంచ్ పరిధిలోని కార్మికులకు ఒక్కో వారం చొప్పున పని దినాలను లెక్కిస్తూ నెల రోజులకో పర్యాయం నగదు రూపకంగా బట్వాడాలు చేస్తారు. అక్టోబర్ మాసంలో చేసిన పనికి సంబంధించి నవంబర్ రెండవ వారంలో వేతనాలు చెల్లించాల్సిన తరుణంలోనే పెద్ద నోట్ల రద్దు అమల్లోకి రావడంతో వేతనాల చెల్లింపులు నిలిచిపోయాయి. లక్షల సంఖ్యలో ఉన్న బీడీ కార్మికులకు కోట్లాది రూపాయల మేర వేతనాలు చెల్లించాల్సి ఉండడం, అంత మొత్తం నగదును బ్యాంకుల నుండి డ్రా చేసే పరిస్థితి లేకపోవడంతో బీడీ యాజమాన్యాలు కూడా నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో ఇకపై బీడీలు చుట్టే కార్మికులందరికీ నేరుగా వారివారి బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలను జమ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామంతో బీడీ కార్మికులకు, యాజమాన్యాలకు మధ్య వారధిగా ఉంటూ సేవలందిస్తున్న టేకేదార్లు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు. కార్మికులకు సంబంధించిన వేతనాలను నేరుగా వారి ఖాతాలలో వేసినట్లయితే, తమ ఉపాధికి ఎసరు వస్తుందని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బీడీలు చుట్టే కార్మికులకు టేకేదార్ల ఆధ్వర్యంలోనే వేతనాల చెల్లింపులు జరుగుతాయి. ఇందుకోసం బీడీ కంపెనీల యాజమాన్యాలు టేకేదార్లకు కొంతమొత్తం కమీషన్‌ను చెల్లిస్తాయ. ప్రస్తుతం కార్మికుల వేతనాలను బ్యాంకుల్లో జమ చేసేందుకు కసరత్తులు చేపట్టడంతో బీడీ పరిశ్రమలో టేకేదార్ వ్యవస్థకు ఇక మంగళం పాడడమే తరువాయిగా మారింది. ఇప్పటికే బీడీ కంపెనీలు తమ పని దినాలను నెలలో పక్షం రోజులకే కుదించివేశాయని, ప్రస్తుతం కార్మికుల వేతనాలను నేరుగా బ్యాంకుల్లో వేసే ప్రక్రియను చేపడితే పూర్తిగా కొలువుల నుండి తొలగిస్తారని టేకేదార్లు వాపోతున్నారు. ఈ నిర్ణయాన్ని విరమించుకోవా లని, లేకుంటే ఆందోళనేనని హెచ్చరిస్తున్నారు.