బిజినెస్

రెండు వారాల గరిష్ఠానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 29: ఒడిదుడుకుల ట్రేడింగ్ మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఆటో, టెలికామ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, ఇండస్ట్రియల్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 43.84 పాయింట్లు పెరిగి 26,394.01 వద్ద స్థిరపడగా, రెండు వారాలకుపైగా గరిష్ఠాన్ని తాకింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 15.25 పాయింట్లు అందుకుని 8,142.15 వద్ద నిలిచింది. ఐటి, ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది. చైనా, సింగపూర్, దక్షిణ కొరియా సూచీలు లాభపడితే, హాంకాంగ్, జపాన్, తైవాన్ సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్లు పెరిగితే, బ్రిటన్ సూచీ పడిపోయింది.