బిజినెస్

ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి తడబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, డిసెంబర్ 1: బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనలో సింగరేణి సంస్థ తడబాటు పడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం 66.03 మిలియన్ టన్నులవగా, గడచిన ఎనిమిది మాసాలలో 4 కోట్ల 7 లక్షల 45 వేల 200 టన్నులు ఉత్పత్తికిగాను.. 3 కోట్ల 64 లక్షల 73 వేల 655 టన్నులు మాత్రమే సాధించి నవంబర్ మాసం ముగిసే సమయానికి 90 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకుంది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాలలో కేవలం రామగుండం-3 ఏరియా మాత్రమే 105 శాతం ఉత్పాదక రేటుతో లక్ష్యాన్ని సాధించగా, మిగిలిన 10 ఏరియాలు లక్ష్యసాధనలో వెనుకంజలో ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా 99 శాతం, ఇల్లందు ఏరియా 79 శాతం, మణుగూరు ఏరియా 87 శాతం, రామగుండం-1 ఏరియా 91 శాతం, రామగుండం-2 ఏరియా 88 శాతం, భూపాలపల్లి ఏరియా 94 శాతం, ఆడ్రియాల ప్రాజెక్ట్ 69 శాతం, బెల్లంపల్లి ఏరియా 98 శాతం, మందమర్రి ఏరియా 61 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 90 శాతం ఉత్పాదకరేట్లను నమోదు చేసుకున్నాయి. ఉత్పత్తి లక్ష్యసాధనకు సింగరేణి సంస్థ ప్రోత్సహకాలు ప్రవేశపెట్టినప్పటికి లక్ష్యసాధనలో విఫలవౌతుంది. ఓపెన్‌కాస్ట్ గనులలో ఉత్పత్తి పెరిగితే తప్ప ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యసాధన కష్టమేనని కార్మిక సంఘాలు, సింగరేణి ఆధికారులు భావిస్తున్నారు.
కోల్ ఇండియాలోనూ..
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్ మాసాల్లో 323.57 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద కోల్ మైనర్ అయిన కోల్ ఇండియా.. అసలు ఏప్రిల్-నవంబర్‌కుగాను నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యం 360.84 మిలియన్ టన్నులు. అయితే ఈ లక్ష్య సాధనలో సంస్థ వెనుకబడిపోయింది. అయితే గత నెల నవంబర్‌లో 50 మిలియన్ టన్నులకుగాను 53.85 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.