బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. మదుపరులు లాభాల స్వీకరణకు దిగడంతో వరుసగా నాలుగు రోజులపాటు నమోదైన లాభాలకు తెరపడింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచి సెనె్సక్స్ 92.89 పాయింట్లు క్షీణించి 26,559.92 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 31.60 పాయింట్లు కోల్పోయి 8,192.90 వద్ద నిలిచింది. మెటల్, పవర్, యుటిలిటీస్, బ్యాంకింగ్, రియల్టీ, టెలికామ్, ఆటో, ఫైనాన్స్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ హెల్త్‌కేర్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు లాభపడ్డాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలైన జపాన్, చైనా, హాంకాంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ సూచీలు లాభాల్లో కదలాడాయి. బ్రిటన్ సూచీ మాత్రం నష్టపోయింది.