బిజినెస్

జోరుగా మారుతి, టొయోటా అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: మారుతి సుజుకి, టొయోటా, రెనాల్ట్ అమ్మకాలు గత నెల నవంబర్‌లో రెండంకెల వృద్ధిని అందుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలోనూ దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి దూకుడు కొనసాగడం గమనార్హం. మరోవైపు మహీంద్ర, ఫోర్డ్, హోండా అమ్మకాలు పడిపోయాయి. టాటా మోటార్స్ అమ్మకాలు 22 శాతం పెరిగినట్లు ప్రకటించింది. కాగా, మారుతి సుజుకి దేశీయ అమ్మకాలు ఈసారి 1,26,325 యూనిట్లుగా నమోదయ్యాయి. నిరుడు నవంబర్‌లో 1,10,599 యూనిట్లుగా ఉన్నాయి. ఆల్టో, వాగనార్ వాహన విక్రయాలు పుంజుకోగా, స్విఫ్ట్, ఎస్టిలో, రిట్జ్, డిజైర్, బాలెనో అమ్మకాలూ పెరిగాయి. ఇక టొయోటా కిర్లోస్కర్ మోటార్ అమ్మకాలు ఈసారి 11,309 యూనిట్లుగా ఉంటే, పోయినసారి 10,278 యూనిట్లుగా ఉన్నాయి. ఇన్నోవా క్రిస్టా, ప్లాటినమ్ ఎషియోస్ అమ్మకాలు బాగా జరిగినట్లు సంస్థ ప్రకటించింది. ఇక టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఈసారి 22 శాతం పెరిగి 12,736 యూనిట్లుగా ఉంటాయి. నిరుడు 10,470 యూనిట్లుగా ఉన్నాయి. ఫోక్స్‌వాగన్ అమ్మకాలూ 1,942 యూనిట్ల నుంచి 4,014 యూనిట్లకు ఎగబాకగా, రెనాల్ట్ విక్రయాలూ 7,819 యూనిట్ల నుంచి 9,604 యూనిట్లకు ఎగిశాయి. అయితే మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు 24.29 శాతం దిగజారాయి. ఫోర్డ్ విక్రయాలూ 21.62 శాతం పడిపోగా, హోండా కార్స్ అమ్మకాలు 45.42 శాతం పతనమయ్యాయి. ద్విచక్ర వాహన విభాగంలో హోండా మోటార్‌సైకిల్ అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. 3,26,466 యూనిట్ల నుంచి 3,25,448 యూనిట్లకు పడిపోయాయి.