బిజినెస్

మార్చి 31దాకా ఉచితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 1: ఉచిత వాయిస్ కాల్స్, డేటా వినియోగం ఆఫర్‌ను మార్చి 31 వరకు పొడిగించింది రిలయన్స్ జియో. ‘జియో హ్యాప్పీ న్యూ ఇయర్’ పేరిట ఉచిత వాయిస్, డేటా, వీడియో, అప్లికేషన్ల సదుపాయాన్ని తమ కస్టమర్లకు మూడు నెలలపాటు పెంచింది. సెప్టెంబర్ 4న మొదలైన ఈ ఉచిత ఆఫర్ తొలుత డిసెంబర్ 31 వరకే అందుబాటులో ఉంటుందని ప్రకటించిన జియో.. దాన్ని ఇప్పుడు మార్చి 31 వరకు తీసుకెళ్లింది. కొత్త కస్టమర్లతోపాటు పాత కస్టమర్లకూ ఈ పొడిగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ముకేశ్ అంబానీ ఇక్కడ ప్రకటించారు. ఈ ఉచిత ఆఫర్‌తో ఇప్పటికే దేశీయ టెలికామ్ రంగంలో అగ్రశ్రేణి సంస్థలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వ్యాపారాలకు పెద్ద దెబ్బపడగా, ఇప్పుడు ఆఫర్ పొడిగింపు నిర్ణయం సదరు సంస్థల ఆదాయానికి భారీ గండినే పెడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, ఉచిత ఆఫర్ ముగిశాక ఒక జిబి డేటా 50 రూపాయలకు పొందవచ్చని, నెలసరి ప్లాన్ 149 రూపాయలతో మొదలవుతుందని జియో తెలిపింది. ఇక ముకేశ్ నేతృత్వంలోని ఈ సంచలనాత్మక 4జి టెలికామ్ సంస్థ కస్టమర్లను అందిపుచ్చుకోవడంలో ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్‌లనూ వెనక్కినెట్టింది. సేవలు ప్రారంభమైన తొలి మూడు నెలల్లో 52 మిలియన్లకుపైగా కస్టమర్లను చేజిక్కించుకుంది. ఇదిలావుంటే పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో జియో మనీ మర్చంట్ సొల్యూషన్స్‌ను ముకేశ్ పరిచయం చేశారు. ఇందులో భాగంగా చిన్న వ్యాపారులకు డిజిటల్ పేమెంట్స్ కోసం ఓ మొబైల్ పేమెంట్ అప్లికేషన్‌ను తెచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మరోవైపు వచ్చే ఏడాది మార్చి 17 వరకు జియో ఉచిత 4జి సేవలను టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ పరిశీలించనుంది. ఉచిత ఆఫర్ పెంపు నేపథ్యంలో ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ చెప్పినట్లుగా కస్టమర్లకు ఉచిత సేవలు అందుతున్నాయా? లేదా? అన్నది చూస్తామని పిటిఐకి ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ అన్నారు. కాగా, ఉచిత ఆఫర్ పొడిగిస్తున్నట్లు చేసిన ముకేశ్ అంబానీ ప్రసంగం తర్వాత ప్రత్యర్థి టెలికామ్ సంస్థల షేర్లు భారీగా పతనాన్ని చవిచూశాయ. ఎయర్‌టెల్, ఐడియా సంస్థలు తమ మార్కెట్ విలువను దాదాపు 3 వేల కోట్ల రూపాయలు కోల్పోయాయ.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ముకేశ్ అంబానీ