బిజినెస్

‘ఆసియా-పసిఫిక్ దేశాలకు భారత్, చైనాలే దిక్సూచి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వచ్చే ఏడాది ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో భారత్, చైనా దేశాలు పాజిటివ్ ఔట్‌లుక్‌తో నిలుస్తాయని గురువారం ఐక్యరాజ్య సమితి అధ్యయనం ఒకటి తెలిపింది. ప్రగతిశీల పన్ను విధానాలు, ప్రభావవంతమైన ఆర్థిక సుపరిపాలనతో ఆసియా-పసిఫిక్ దేశాల్లోనే భారత్, చైనాలు ఆదర్శవంతంగా ముందుకెళ్తున్నాయని ఆ అధ్యయనంలో ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. భారత్, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు స్థిరంగా వృద్ధిపథంలో పయనిస్తాయని, ఆసియా-పసిఫిక్ దేశాల వృద్ధిరేటుకు ఈ రెండు దేశాలు నాయకత్వం వహిస్తాయని పేర్కొంది. ఈ మేరకు తాము నిర్వహించిన ఓ ఆర్థిక, సామాజిక సర్వేలో తేలినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది.