బిజినెస్

రివర్స్ గేర్‌లోకి దేశ ఆర్థిక వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రపంచంలోనే పరుగులు పెడుతున్న జిడిపి భారత్ సొంతం. వృద్ధిరేటులో భారత్‌కు సాటిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దిక్సూచి భారత్.. నిన్నమొన్నటిదాకా దేశ ఆర్థిక వ్యవస్థపై వినిపించిన అభిప్రాయాలివి. భారత్ జిడిపి తగ్గుముఖం పడుతుంది. పారిశ్రామిక వ్యవస్థలో మందగమనం కనిపిస్తోంది. వృద్ధిరేటు నెమ్మదించింది.. ఇవి ఇప్పుడు వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. దీనికి కారణం అంతర్జాతీయ పరిణామాలు కావు. అమెరికా, ఐరోపా ఆర్థిక వ్యవస్థల సంక్షోభం అంతకన్నా కాదు. కేవలం మూడు వారాల క్రింద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయం. అవును.. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం 500, 1,000 రూపాయల నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆశయం ఏమాత్రం నెరవేరుతుందో తెలియదుకానీ, దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం కుదేలవుతోంది. ప్రపంచంలో పెరెన్నికగల ఆర్థికవేత్తల అభిప్రాయమిదే. బ్యాంక్ ఆఫ్ అమెరికా, నొమురా, మోర్గాన్ స్టాన్లీ, ఫిచ్ తదితర అగ్రశ్రేణి రేటింగ్ ఏజెన్సీలు భారత జిడిపి వృద్ధి అంచనాలను తగ్గించాయి మరి. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలే కాదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ వర్గాలూ ఇదే చెబుతున్నాయి. నోట్ల రద్దు కారణంగా నెలకొన్న విపత్కర పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆ వ్యాపారం, ఈ వ్యాపారం.. ఆ రంగం, ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని వ్యాపారాల్లో లావాదేవీలు పడిపోయాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీలు గణనీయంగా దిగజారాయి. కేవలం పాత నోట్ల డిపాజిట్లు, కొత్త నోట్ల సరఫరాకే పరిమితం కావడంతో పారిశ్రామిక రంగాలకు ఆర్థిక చేయూత కరువైంది. ఉత్పాదక సామర్థ్యం క్షీణించగా, మార్కెట్‌లో కొనుగోళ్లూ తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17) భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను బ్యాంక్ ఆఫ్ అమెరికా 6.9 శాతానికి కుదించింది. ఇంతకుముందు ఈ అంచనా 7.4 శాతంగా ఉండేది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) 7.2 శాతంగా ఉండొచ్చంది. మరోవైపు ఫిచ్ రేటింగ్స్ కూడా 2016-17కు తమ జిడిపి అంచనాను 7.4 శాతం నుంచి 6.9 శాతానికి తీసుకొచ్చింది. 2017-18లో 7.7 శాతంగా, 2018- 19లో 8 శాతంగా ఉండొచ్చంది. స్టాండర్డ్ అండ్ పూర్స్‌కు చెందిన క్రిసిల్ కూడా భారత జిడిపి వృద్ధి అంచనాను తగ్గించింది. 2016- 17కుగాను ఏకంగా 7.9 శాతం నుంచి 6.9 శాతానికి దించింది. పడిపోయన వినియోగ సామర్థ్యంతోనేనని స్పష్టం చేసింది. అయతే వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం అంచనానూ తగ్గించింది. ఇక మోర్గాన్ స్టాన్లీ సైతం 2016-17కు తమ జిడిపి అంచనాను 7.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. 2017-18లో 7.7 శాతం, 2018-19లో 7.9 శాతంగా అంచనా వేసింది. ఇదిలావుంటే ఈ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి 6.5 శాతంగానే ఉండొచ్చని నొమురా అంచనా వేసింది. వచ్చే జనవరి-మార్చిలో 7 శాతంగా ఉంటుందని చెప్పింది. బుధవారం కేంద్ర గణాంకాల కార్యాలయం ఈ జూలై-సెప్టెంబర్‌లో దేశ జిడిపి వృద్ధి 7.3 శాతంగా ఉందని పేర్కొనగా, మున్ముందు త్రైమాసికాల్లో ఇది తగ్గవచ్చని అంచనా వేసినది తెలిసిందే. ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. మొత్తానికి నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ఆర్థిక వృద్ధి పరుగులకు ఒక్కసారిగా బ్రేక్‌పడినట్లైంది. మళ్లీ పరుగందుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఇప్పుడే చెప్పలేని పరిస్థితి.