బిజినెస్

సెనె్సక్స్ 329 పాయంట్లు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ ఆందోళనకర పరిస్థితుల మధ్య బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 329.26 పాయింట్లు క్షీణించి 26,230.66 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 106.10 పాయింట్లు పతనమై 8,086.80 వద్ద నిలిచింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు, ఇటలీ రాజ్యాంగ రెఫరెండమ్‌పై మదుపరులు భయాలకు లోనవడంతో సూచీ లు నష్టాలకు గురయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ (ఎమ్‌ఎస్‌ఎస్), ప్రస్తుత జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాలు కూడా మదుపరుల పెట్టుబడులను దెబ్బతీశాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఇండస్ట్రియల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఆటో, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఫైనాన్స్, చమురు, గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఇకపోతే ఆసియా మార్కెట్లలో కీలక సూచీలైన చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.31 శాతం నుంచి 1.37 శాతం వరకు దిగజారాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, లండన్ సూచీలు 0.93 శాతం నుంచి 1.33 శాతం వరకు పడిపోయాయి.