బిజినెస్

ఎమ్‌ఎమ్‌టిసిలో అమ్మకానికి ప్రభుత్వ వాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, డిసెంబర్ 3: ప్రభుత్వరంగ ట్రేడింగ్ సంస్థ ఎమ్‌ఎమ్‌టిసిలో ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 15 శాతం వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి) వేద్ ప్రకాశ్ శనివారం ఇక్కడ తెలిపారు. ‘సంస్థలో 15 శాతం ప్రభుత్వ వాటా అమ్మకానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల ఖజానాకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఆదాయం లభిస్తుందని భావిస్తున్నాం.’ అని పిటిఐతో వేద్ ప్రకాశ్ చెప్పారు. కాగా, 2013 జూన్‌లో ఎమ్‌ఎమ్‌టిసిలోని 9.33 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్మేసింది. దీంతో 570 కోట్ల రూపాయల నిధులను అందుకుంది. ప్రస్తుతం సంస్థలో ఇంకా ప్రభుత్వానికి 89.93 శాతం వాటా ఉంది. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా ఖజానాకి భారీగా నిధులను తరలించాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తుండగా, ఆ లక్ష్యాలను నెరవేర్చే దిశలో 25 శాతానికి దిగువకు ప్రభుత్వ వాటా చేరరాదని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ స్పష్టం చేస్తోంది. అయితే దాదాపు అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో ఇప్పటివరకైతే సుమారు 50 శాతం వరకు కేంద్రానికి వాటా ఉంది.