బిజినెస్

ఎయిర్‌సెల్ అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: ప్రైవేట్‌రంగ టెలికామ్ సంస్థ ఎయిర్‌సెల్.. సోమవారం ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. పరిమితస్థాయి ఉచిత డేటా వినియోగంతో నెట్‌పై 3 నెలల అపరిమిత కాల్స్‌ను ముందుకుతెచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకూ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. 148 రూపాయలకే ఈ ఆఫర్‌ను వినియోగదారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్‌సెల్ టు ఎయిర్‌సెల్ ఉచిత లోకల్-ఎస్‌టిడి కాల్స్, ఎయిర్‌సెల్ టు ఇతర నెట్‌వర్క్‌లకు నెలకు 250 నిమిషాల ఉచిత లోకల్-ఎస్‌టిడి కాల్స్‌ను మూడు నెలలపాటు అందిస్తున్నట్లు తెలిపింది. అయితే ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలోని వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.