బిజినెస్

జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: టాటా సన్స్ నేతృత్వంలో నడుస్తున్న ట్రస్టులను సంస్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్ర్తి కోరారు. టాటా సన్స్ నిర్ణయాలు విశ్వసనీయంగా లేవని, సరైన నాయకత్వం లేదని అన్నారు. ఈ నెల 13న టాటా గ్రూప్ సంస్థల్లో అతిపెద్దదైన టిసిఎస్‌కు సంబంధించి ఇజిఎమ్ జరుగుతున్న క్రమంలో సోమవారం మిస్ర్తి పైవిధంగా స్పందించారు. అక్టోబర్ 24న టాటా సన్స్ చైర్మన్‌గా మిస్ర్తి ఉద్వాసనకు గురైనది తెలిసిందే. 100 బిలియన్ డాలర్ల విలువైన 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్‌లో ఒక్కో సంస్థ చైర్మన్‌గిరీ నుంచి మిస్ర్తిని టాటా సన్స్ తప్పిస్తున్నదీ విదితమే.
మిస్ర్తికి మద్దతివ్వండి
మరోవైపు గ్లోబల్ ప్రాక్సి అడ్వైజరీ సంస్థ ఐఎస్‌ఎస్.. మిస్ర్తికి మద్దతివ్వాలని టిసిఎస్ భాగస్వాములను కోరింది. టిసిఎస్ చైర్మన్‌గిరీ నుంచి ఇప్పటికే మిస్ర్తిని తప్పించిన టాటా సన్స్.. ఆ స్థానంలో కొత్తవారిని ఎంపిక చేసింది కూడా. సంస్థ డైరెక్టర్ హోదా నుంచి కూడా మిస్ర్తిని తప్పించాలని ఈ నెల 13న ఇజిఎమ్‌ను నిర్వహిస్తోంది. దీంతో మిస్ర్తికి ఓటేయాలని ఐఎస్‌ఎస్ పిలుపునిచ్చింది.
మిస్ర్తి తీరుతో గ్రూప్‌నకు నష్టం
మరోవైపు మిస్ర్తి తీరు టాటా గ్రూప్ సంస్థలకు పెను నష్టాన్ని కలిగిస్తోందని టాటా సన్స్ ఆక్షేపించింది. టాటా సన్స్‌లో నాయకత్వ లేమి కనిపిస్తోందని, నిర్ణయాలు విశ్వసనీయంగా లేవని అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా తీరునూ అవకాశం చిక్కినప్పుడల్లా మిస్ర్తి ఎండగడుతున్నది తెలిసిందే. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం గ్రూప్ ప్రయోజనాలను టాటా పణంగా పెడతారని మిస్ర్తి గతంలో ఆరోపించారు. అయితే మిస్ర్తి తాజా వ్యాఖ్యలు గ్రూప్ ప్రతిష్ఠను మంటగలుపుతున్నాయని టాటాలు దుయ్యబట్టారు.