బిజినెస్

వడ్డీరేట్ల కోత అంచనాలతో.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 118.44 పాయింట్లు పెరిగి 26,349.10 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 41.95 పాయింట్లు ఎగిసి 8,128.75 వద్ద నిలిచింది. బుధవారం జరిగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు విస్తృతంగా వినిపిస్తున్న నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం ఆరంభం నుంచి లాభాల్లో కదలాడిన సూచీలు.. చివరిదాకా అదే దారిలో పయనించాయి. ఇటలీ రెఫరెండమ్‌లో ప్రధాని రేంజి పిలుపునకు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగినప్పటికీ ఐరోపా మార్కెట్లు లాభాల్లో నడవడం గమనార్హం. ఇకపోతే దేశీయంగా ఆటో, మెటల్, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్లు 1.92 శాతం నుంచి 1.36 శాతం వరకు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, షాంగై, హాంకాంగ్ సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు పుంజుకున్నాయి.