బిజినెస్

కొత్త ఏడాదిలో వడ్డీ రేట్లు అరశాతం తగ్గొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రిజర్వ్ బ్యాంక్ బుధవారం జరిపిన ద్రవ్యపరపతి విధానం సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించకపోయినప్పటికీ కొత్త సంవత్సరంలో 25-50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించే అవకాశాలు లేకపోలేదని ఓ తాజా నివేదిక అభిప్రాయ పడింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం పెరగవచ్చన్న భయాలతో ఆర్‌బిఐ బుధవారం జరిపిన ద్రవ్య సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులూ చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. నోట్ల రద్దు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాలను కుదించిన నేపథ్యంలో ఆర్‌బిఐ వచ్చే ఫిబ్రవరిలో సైతం యథాతథ స్థితిని కొనసాగించే అవకాశాలు లేకపోలేదని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ సంస్థ తన నివేదికలో అభిప్రాయపడింది. నోట్ల రద్దు ప్రభావం ఆర్థికాభివృద్ధిపై 15 బేసిస్ పాయింట్ల మేర మాత్రమే ఉంటుందని ఆర్‌బిఐ అభిప్రాయ పడగా, వివిధ రంగాలు నగదుపై ఆధారపడడం ఆధారంగా చూసినట్లయితే దీని ప్రభావం వృద్ధిరేటుపై అంతకన్నా ఎక్కువే ఉంటుందని ఆ నివేదిక అభిప్రాయ పడింది. నోట్ల రద్దు కారణంగా మీడియం టెర్మ్ లాభాలు ఉండే అవకాశాలున్నప్పటికీ స్వల్పకాలంలో దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగానే ఉంటుందని ఆ నివేదిక అభిప్రాయ పడింది.