బిజినెస్

ఇ-నామ్ గ్రాండ్ సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో అమ్ముకుని ఆదాయాన్ని పెంపొందించుకునేలా రైతులకు వీలుకల్పిస్తున్న ప్రభుత్వం తొలి విడతగా దేశంలోని పది రాష్ట్రాల్లో గల 250 మండీలను ఇ-నామ్ (ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించిందని, దీని ద్వారా 421 కోట్ల రూపాయల సరుకుల క్రయవిక్రయాలు జరిగాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ వెల్లడించారు. ఈ కొత్త వసతిని ఆసరాగా చేసుకుని ప్రయోజనం పొందే విధంగా మరింత మంది రైతులను ప్రోత్సహించేందుకు ఇ-నామ్ ప్లాట్‌ఫామ్ ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్న సరుకుల ధరల వివరాలను తెలియజేసే మొబైల్ అప్లికేషన్ (మొబైల్ యాప్)ను ఆయన ఆవిష్కరించారు. దేశంలోని ఎనిమిది రాష్ట్రాకు చెందిన 22 మండీలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌లో ప్రయోగాత్మకంగా ఇ-నామ్‌ను ప్రారంభించిన విషయం విదితమే. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 200 మండీలను, 2018 మార్చి నాటికి మొత్తం 585 మండీలను ఇ-నామ్‌తో అనుసంధానించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే గత నెలాఖరు నాటికే పది రాష్ట్రాలకు చెందిన 250 మండీలను ఇ-నామ్‌తో అనుసంధానించి లక్ష్యాన్ని అధిగమించామని, ఇ-నామ్ అమలుకు సంబంధించి తొలి దశలో ఎదురైన సమస్యల్లో చాలా మేరకు పరిష్కారమయ్యాయని తెలియజేసేందుకు ఎంతో సంతోషిస్తున్నానని రాధా మోహన్ సింగ్ చెప్పారు. ఇ-నామ్ ద్వారా ఇప్పటివరకూ 421 కోట్ల రూపాయల విలువచేసే 1,53,992 టన్నుల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరిగాయని, ప్రస్తుతానికి 1,60,229 మంది రైతులు, 46,688 మంది వర్తకులు, 25,970 మంది కమీషన్ ఏజెంట్లు ఇ-నామ్‌లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారని, ఇ-నామ్ ద్వారా క్రయవిక్రయాలు జరిపేందుకు పండ్లు, కూరగాయలు సహా దాదాపు 69 వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం నోటిఫై చేసిందని మంత్రి తెలిపారు.

చిత్రం..వివరాలు వెల్లడించిన రాధామోహన్ సింగ్