బిజినెస్

మిస్ర్తిపై మరో వేటుకు ముహూర్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: టాటా గ్రూపులో అన్‌లిస్టెడ్ సంస్థ అయిన టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎల్) ఈ నెల 14వ తేదీన తమ వాటాదారుల సమావేశాన్ని నిర్వహించనుంది. టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని తొలగించాలంటూ హోల్డింగ్ సంస్థ అయిన టాటా సన్స్ నుంచి వచ్చిన ప్రతిపాదనను పరిశీలించేందుకు టిటిఎల్ ఈ సమావేశాన్ని నిర్వహించనుంది. టాటా టెలీ సర్వీసెస్ లిమిటెడ్‌లో డైరెక్టర్ పదవి నుంచి సైరస్ మిస్ర్తిని తొలగించాలని కోరుతూ తమ సంస్థలో 36.17 శాతం పెయిడప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను కలిగివున్న టాటా సన్స్ లిమిటెడ్ విజ్ఞప్తి చేసిందని, ఈ విజ్ఞప్తిపై చర్చించి మిస్ర్తిని తొలగించేందుకు బుధవారం 11 గంటలకు అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని (ఇజిఎంను) నిర్వహిస్తున్నామని వాటాదారులకు పంపిన నోటీసులో టిటిఎల్ స్పష్టం చేసింది. టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటాకు, సైరస్ మిస్ర్తికి మధ్య విభేదాలు తలెత్తడంతో అక్టోబర్ 24వ తేదీన టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి మిస్ర్తికి అనూహ్య రీతిలో ఉద్వాసన పలికారు. దీంతో టాటా సన్స్ సంస్థ తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా మరోసారి బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే.

చిత్రం..సైరస్ మిస్ర్తి