బిజినెస్

జిఎస్‌టిపై రాష్ట్రాల డిమాండ్లతో కేంద్ర అధికారాలకే ఎసరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ఏడాదికి కోటిన్నరకన్నా తక్కువ టర్నోవర్ ఉంటే పన్ను చెల్లింపుదారులపై అధికారం పూర్తిగా తమకే ఉండాలని రాష్ట్రాలు చేస్తున్న డిమాండ్ వల్ల కేంద్రం అధికారాలు తగ్గిపోతాయని కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ పన్నుల బోర్డు (సిబిఇసి) చైర్మన్ నజీబ్ షా గురువారం అన్నారు. కేంద్ర, రాష్ట్రాల అంశాలున్న కొత్త వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)ని ఎలా అమలు చేయాలనే దానిపై కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జిఎస్‌టికి సంబంధించిన అనుబంధ చట్టాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. వచ్చే ఏప్రిల్‌నుంచి జిఎస్‌టిని అమలు చేయాలని కేంద్రం భావిస్తుండడం, పన్ను చెల్లింపుదారుడిని ఒకసారి ఒక టాక్స్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే అసెస్ చేయాలనే దానికి కేంద్రం, రాష్ట్రాలు రెండూ కూడా కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే జిఎస్‌టిని ద్వంద్వ వ్యవస్థగా రూపకల్పన చేయడం, ఈ పన్నును ద్వంద్వ అసెస్‌మెంట్‌గా మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం అనుకుంటూ ఉండడం వల్లనే ఈ ఇబ్బంది తలెత్తినట్లు నజీబ్ షా చెప్పారు. కొన్ని రకాల సరకులనుంచి కేంద్రం ప్రభుత్వం దూరంగా ఉండాలా లేదా అనేదానిపైనే ఇప్పుడు చర్చ అంతా జరుగుతోందని ఆయన అంటూ, అయితే నేను మీకు అధికారమిచ్చినప్పుడు మీరు నా అధికారాలను తగ్గించకూడదనేది మా అభిప్రాయమని, అంటే ఒక విధంగా ఇది అధికారాలను తగ్గించడమేనని, దీనిపై మాకు అభ్యంతరాలున్నాయని అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ షా చెప్పారు. వస్తువులు, సేవల రంగాల్లో ఏడాదికి కోటిన్నరకన్నా తక్కువ టర్నోవర్ ఉండే చిన్న పన్ను చెల్లింపుదారులపై తమకే పూర్తి అధికారాలుండాలని పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడులాంటి రాష్ట్రాలు డిమాండ్ చేస్తూ ఉండడంతో ఇంతకు ముందు రెండు సార్లు ఈ అంశంపై సమావేశమైన జిఎస్‌టి కౌన్సిల్‌లో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేక పోయిన విషయం తెలిసిందే.అసెసీలపై ఎవరికి అధికారం ఉండాలనే దానిపై జిఎస్‌టి కౌన్సిల్ కీలక సమావేశం త్వరలో జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చిత్రం..జిఎస్‌టిపై గురువారం న్యూఢిల్లీలో అసోచామ్ నిర్వహించిన జాతీయ సదస్సుకు హాజరైన సిబిఇసి చైర్మన్ నజీబ్ షా