బిజినెస్

నెల గరిష్ఠానికి సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.90 పాయింట్లు పెరిగి నెల రోజుల గరిష్ఠాన్ని తాకుతూ 26,747.18 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.90 పాయింట్లు అందుకుని 8,261.75 వద్ద నిలిచింది. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 516.52 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 174.95 పాయింట్లు ఎగిసింది.
కాగా, శుక్రవారం ట్రేడింగ్ విషయానికొస్తే ఉదయం ఆరంభంలో సెనె్సక్స్ 109 పాయింట్లు, నిఫ్టీ 25 పాయింట్లు పెరిగింది. అయితే సమయం గడుస్తున్నకొద్దీ లాభాలు తగ్గాయి. అయినప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి కనబరచడంతో సూచీలు లాభాల్లోనే ముగియగలిగాయి. రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఆసియా మార్కెట్లలో జపాన్, చైనా సూచీలు పెరిగితే, హాంకాంగ్ సూచీ పడిపోయింది. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు లాభాల్లో కదలాడాయి.