బిజినెస్

ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికా రిజర్వ్ బ్యాంక్ అయన ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష, స్థూల ఆర్థిక గణాంకాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల ద్రవ్యసమీక్షను ఈ నెల 13న ఫెడ్ రిజర్వ్ ప్రారంభిస్తుంది. దీంతో వడ్డీరేట్ల విషయంలో ఫెడ్ రిజర్వ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్రా కనిపిస్తోంది. కాగా, పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలూ మదుపరుల పెట్టుబడులను శాసించ నున్నాయని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. బ్యాంకుల్లో పెద్ద ఎత్తున పాత నోట్లు డిపాజిట్ అవుతున్నప్పటికీ, వాటి స్థానంలో కొత్త నోట్ల మార్పిడి వేగంగా జరగకపోవడం, ముఖ్యంగా 100 రూపాయల నోట్ల చెలామణి తగ్గి వ్యాపారాలు స్తంభించిపోవడం మదుపరులనూ కలవరపెడు తోంది. దీంతో ద్రవ్యవ్యవస్థలోకి పెరిగే కొత్త నోట్లతోనే మార్కెట్లు లేవడమా? పడిపోవడమా? అనేది తెలుస్తుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపనున్నాయ. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైతే ఆ దేశానికేగాక, ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని మెజారిటీ మదుపరులు ఎన్నికల సమయంలో పెట్టుబడులను లాగేసుకున్నది తెలిసిందే. ఫలితంగా భారత్‌సహా అన్ని ప్రధాన దేశాల మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయ. అయతే ట్రంప్ గెలవడం, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగం మదుపరులను ఆకట్టుకోవడంతో పరిస్థితి కొంత మెరుగైంది. కానీ ప్రస్తుత ట్రంప్ విధానాలు మళ్లీ భయాందోళనలకు దారితీస్తు న్నాయ. అంతేగాక ఆయన ఎన్నికపై రగులుతున్న వివాదాలూ ప్రాధాన్యతను సంతరించు కుంటున్నాయ. ఇకపోతే ద్రవ్యోల్బణం గణాంకాలను కేంద్ర ప్రభుత్వం ఈ వారమే విడుదల చేస్తోంది. వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు మంగళవారం, టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ద్రవ్యోల్బణం గణాంకాలు బుధవారం విడుదలవుతున్నాయ. దీంతో మంగళ, బుధవారాలు రెండు రోజులూ ద్రవ్యోల్బణం గణాంకాల ప్రభావం మార్కెట్ ట్రేడింగ్‌పై సహజంగానే పడనుంది. అయతే అంతకంటే ముందు సోమవారం ట్రేడింగ్‌పై గత వారం విడుదలైన ఐఐపి గణాంకాల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి సూచీ గణాంకాలు మైనస్‌లో నమోదయ్యాయ. అక్టోబర్‌లో మైనస్ 1.9 శాతానికి క్షీణించింది. పడిపోయిన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి, పేలవమైన తయారీరంగ ప్రదర్శన కారణంగా మళ్లీ ఐఐపి గణాంకాలు రుణాత్మకంగానే నమోదయ్యాయి. మరోవైపు ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయ. ముఖ్యంగా రూపాయ మారకం విలువ అన్నింటికంటే అధికంగా దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయ విలువ గత నెల తీవ్ర ఒడిదుడుకులకు లోనైనది తెలిసిందే. దీంతో మరింతగా క్షీణిస్తే ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై కచ్ఛితంగా కనిపిస్తుంది. ఫలితంగా మదుపరులు ఫారెక్స్ ట్రేడింగ్‌పైనా దృష్టి సారిస్తారని మెజారిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా, గత నాలుగు నెలల్లో ఎన్నడూ లేనంతగా గడచిన వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 517 పాయింట్లు పుంజుకుంది. 26,747 పాయింట్లకు చేరి ఒక నెల గరిష్ఠ స్థాయినీ తాకింది. నవంబర్ 11 తర్వాత సెనె్సక్స్ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే ప్రథమం. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా గడచిన వారం ట్రేడింగ్‌లో 8,200 స్థాయిని అధిగమించింది. 175 పాయింట్లు పెరిగి 8,261.75 వద్ద నిలిచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నిర్వహించిన తాజా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు తగ్గకపోయినప్పటికీ మదుపరులు పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరచడం గమనార్హం. ఇందుకు కారణం యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఇసిబి) ఉద్దీపనలే. మార్చి తర్వాత కూడా ఉద్దీపనలుంటాయని ఇసిబి ప్రకటించింది. దీంతో విదేశీ మదుపరులతోపాటు దేశీయ మదుపరుల్లోనూ ఉత్సాహం ఉరకలెత్తింది. ఫలితంగా ఈ ఏడాది సెప్టెంబర్ 2 నుంచి గమనిస్తే అత్యుత్తమ వారపు లాభాలు నమోదయ్యాయి.