బిజినెస్

పెరిగిన డిఎల్‌ఎఫ్ రుణ భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నిర్మాణ రంగ దిగ్గజం డిఎల్‌ఎఫ్ నికర రుణ భారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో ముగిసిన ఏడాదిలో 1,021 కోట్ల రూపాయలు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్ నాటికి 22,120 కోట్ల రూపాయలుగా ఉన్న డిఎల్‌ఎఫ్ రుణాలు.. ఈ జూలై-సెప్టెంబర్ ముగిసే నాటికి 23,141 కోట్ల రూపాయలకు చేరాయి. కాగా, రెంటల్ విభాగం డిఎల్‌ఎఫ్ సైబర్ సిటీ డెవలపర్స్ లిమిటెడ్‌లో 40 శాతం వాటాను డిఎల్‌ఎఫ్ ప్రమోటర్లు అమ్మేస్తున్నారు. మిగతా 60 శాతం వాటా వాణిజ్య ఆస్తుల రూపంలో ఉంది. అమేస్తున్న 40 శాతం వాటా విలువ 12,000 కోట్ల రూపాయల నుంచి 14,000 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. డిఎల్‌ఎఫ్ ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 206.09 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రిందటిసారి 206.18 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 2,070.67 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,040.84 కోట్ల రూపాయలుగా ఉంది.
అలాగే ఈ ఏప్రిల్-సెప్టెంబర్‌లో సంస్థ లాభం 467.51 కోట్ల రూపాయలుగా, నిరుడు 332.05 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 3,938.13 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 4,429.56 కోట్ల రూపాయలుగా ఉంది.