బిజినెస్

విమాన టిక్కెట్లకూ ఇక ఇఎమ్‌ఐ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న నగదు కొరత దృష్ట్యా దేశీయ ప్రైవేట్‌రంగ ఎయిర్‌లైన్స్ జెట్ ఎయిర్‌వేస్ ఓ సరికొత్త ఆలోచనకు తెరతీసింది. తమ విమాన ప్రయాణీకులకు టిక్కెట్ కొనుగోళ్లపై ఇఎమ్‌ఐ సదుపాయాన్ని కల్పించింది. ముంబయి ఆధారిత విమానయాన సంస్థ అయిన జెట్ ఎయిర్‌వేస్.. ఇందుకోసం ప్రముఖ ప్రైవేట్‌రంగ బ్యాంకులైన యాక్సిస్, హెచ్‌ఎస్‌బిసి, ఐసిఐసిఐ, కొటక్ మహీంద్ర, ఇండస్‌ఇండ్, స్టాండర్డ్ చార్టర్డ్‌లతో చేతులు కలిపింది. జెట్ ఎయిర్‌వేస్ టిక్కెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణీకులు ఈ బ్యాంకుల సాయంతో ఇఎమ్‌ఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ మేరకు సోమవారం సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ‘్భరత ఆర్థిక వ్యవస్థలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డిజిటల్ పేమెంట్లకు ప్రజలు, ముఖ్యంగా యువత పెద్దపీట వేస్తోంది. కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులను అధికంగా వినియోగిస్తున్నారు. వాయిదా (ఇఎమ్‌ఐ) పద్ధతులను ఎంచుకుంటున్నారు. కాబట్టి విమాన టిక్కెట్ల కొనుగోలుకూ ఇఎమ్‌ఐ అవకాశాన్ని ఇస్తున్నాం.’ అని జెట్ ఎయిర్‌వేస్ ముఖ్య వాణిజ్య అధికారి జయరాజ్ షణ్ముగం అన్నారు. బుకింగ్ సమయంలో 3, 6, 9, 12 నెలల వాయిదా పద్ధతుల్లో టిక్కెట్లను కొనవచ్చని చెప్పారు. మొత్తానికి టెలివిజన్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు ఇలా ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వస్తువులను ఇఎమ్‌ఐల ద్వారా సొంతం చేసుకున్న కస్టమర్లు.. ఇకపై విమాన టిక్కెట్లనూ ఇఎమ్‌ఐల ద్వారా పొందే అవకాశం వచ్చింది.